
ఫ్లోరిడా : ఫ్లోరిడాలో భారత్ తో జరుగుతున్న ఫస్ట్ టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ తడబడింది. తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లనష్టానికి 95 రన్స్ మాత్రమే చేసింది. విండీస్ కు మంచి ప్రారంభం దక్కలేదు. ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ కోల్పోవడంతో..ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు నిలకడగా ఆడలేక పోయారు. పోలార్డ్ (49)ఒక్కడే రాణించడంతో విండీస్ కు ఆ మాత్రం స్కోర్ దక్కింది.
భారత్ బౌలర్లలో..సందీప్ సైనీ(3), భువనేశ్వర్ కుమార్(2) వికెట్లతో చెలరేగగా..వాషింగ్టన్ సుందర్, ఖలీల్, కృనాల్ పాండ్యా, జడేజా తలో వికెట్ తీశారు.
Innings Break!
A three-wkt haul for Saini as #TeamIndia bowlers restrict West Indies to a total of 95/9 after 20 overs.#WIvIND pic.twitter.com/MMn9drOxh1
— BCCI (@BCCI) August 3, 2019