సిరీస్ మ్యాచ్ : విండీస్ పై టాస్ గెలిచిన భారత్

సిరీస్ మ్యాచ్ : విండీస్ పై టాస్ గెలిచిన భారత్

ఫ్లోరిడా : వెస్టిండీస్ తో 3టీ20ల సిరీస్ లో భాగంగా ఆదివారం ఫ్లోరిడాలో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచింది భారత్. కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోహ్లీ మాట్లాడుతూ.. పిచ్‌ లో తేమ ఆవిరైందని.. అందుకే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నానని చెప్పాడు. టీమ్ లో ఎలాంటి మార్పుల్లేవని కోహ్లీ తెలిపాడు. తమ టీమ్ లో క్యాంప్‌ బెల్‌ ప్లేస్ లో పెర్రీ వచ్చాడని తెలిపాడు విండీస్ కెప్టెన్ కార్లోస్ బ్రాత్ వైట్.

ఫస్ట్ మ్యాచ్ లో గెలిచి మంచి జోరుమీదున్న టీమిండియా..ఇవాళ్టి మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఫస్ట్ మ్యాచ్ లో తడబడ్డ విండీస్ ..ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ పై ఆశలను సజీవంగా ఉంచాలనుకుంటుంది. దీంతో 2 టీమ్స్ కు ఈ మ్యాచ్ కీలకం కానుంది.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..