
ప్రజాభవన్ ముందు యాక్సిడెంట్ కేసులో A3 గా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పరారీలో ఉన్నారని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. రాహిల్, షకీల్ ఇద్దరు దుబాయ్ లో ఉన్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ప్రధాన నిందితుడు రాహిల్ తో పాటు.. మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కూడా లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. ఈ కేసులో ఏ1గా సోహైల్, ఏ2గా అబ్దుల్ ఉన్నారు.
ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశామని చెప్పారు. పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్, బోధన్ మాజీ ఇన్స్పెక్టర్ లను అరెస్ట్ చేసి జడ్జ్ ముందు ప్రొడ్యూస్ చేశాం... వారిద్దరికి పర్సనల్ బాండ్ పైన కోర్టు బెయిల్ ఇచ్చిందన్నారు. ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితులకు పోలీసులు సహకరించినట్లు గుర్తించాం.. ఈ కేసులు నిందితులకు సహకరించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో 2022 మార్చిలో జరిగిన ఓ యాక్సిడెంట్లో ఒక బాబు చనిపోయాడు. ఈ కేసులో కూడా మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ ని తప్పించారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ కేసును కూడా ఇపుడు తిరిగి విచారణ చేస్తామని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఆ కేసులో కోర్టులో ట్రయల్ జరుగుతుందని చెప్పారు డీసీపీ.
డిసెంబర్ 23న అర్థరాత్రి ప్రజాభవన్ దగ్గర తన కారుతో భారీ కేడ్ ను ఢీ కొట్టి పరారయ్యారు. ఈ ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా షకీల్ కొడుకు సాహిల్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించారని షకీల్ పైన కేసు నమోదు చేశారు. పోలీసులు షకీల్ ఆయన కొడుకు సాహిల్ పై లుక్ నోటీసులు జారీ చేశారు . వారు దుబాయ్ లో ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు