
పెండ్లిండ్లకి కంచిపట్టు, పోచంపల్లి చీరలు. కిట్టీ పార్టీలు, ఫంక్షన్స్‌కి బెనారస్, బాందినీ, చందేరి... ట్రెండీ అకేషన్స్ అయితే సీక్వైన్, రఫెల్ శారీస్. ఇలా సందర్భాన్ని బట్టి చీరల్ని ఎంచుకుంటారు చాలామంది. అలాంటప్పుడు చీరకట్టు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఎందుకు? చీరలతో పాటు చీర కట్టు కూడా కొత్తగా ఉండాలి కదా. అందుకే ట్రెడిషనల్ శారీకి వెస్ట్రన్ పల్లుని సెట్ చేస్తే సరి. వాటిల్లో కొన్ని డిజైన్స్ ఇవిగో. ఇవి టీనేజర్స్‌కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ట్రెండీ వేర్కి కేరాఫ్‌గా ఉండే ఈ డ్రేపింగ్ స్టైల్ మీదకి యాక్సెసరీస్ హెవీగా వద్దే వద్దు.