ఇలాంటి సాహసాలు భారతీయులకే సాధ్యం: పారే నీటిలో క్రికెట్ మ్యాచ్

ఇలాంటి సాహసాలు భారతీయులకే సాధ్యం: పారే నీటిలో క్రికెట్ మ్యాచ్

భారతీయులు ఆలోచనలు విభిన్నమని.. వారికి సాధ్యం కానీ పని ఏదీ ఉండదని ప్రపంచదేశాల నేతలు పొగడటం మనం ఎన్నో సార్లు చూశాం. బహుశా! ఇలాంటివి చూసే వారు అలా చెప్పరేమో. కొందరు కుర్రాళ్ళు క్రికెట్ అనగానే.. బ్యాట్, బాల్ చేతపట్టుకొని మైదానానికి పరుగెత్తలేదు. జలజల నీళ్లు పారే నది వైపు అడుగులు వేశారు. ఇంకేముంది నలుగురు.. నాలుగు వైపుల నిల్చొని క్రికెట్ ఆడటం మొదలు పెట్టేశారు. 

పారే నీటిలో క్రికెట్ మ్యాచ్ ఎలా ఆడారు అని ఆశ్చర్యపోకండి. నీరు ప్రవహిస్తుంటే బాల్ వెళ్ళిపోదా అనేగా.. మీ డౌట్. ఆ సందేహం అక్కర్లేదు. ఎందుకంటే బంతిని అడ్డుకునేందుకు గజ ఈతగాల్లాంటి ఓ చిన్న పోరాడిని జట్టులో చేర్చుకున్నారు. అతగాడు బంతిని అడ్డుకునేందుకు బట్టలిప్పుకొని సిద్ధంగా ఉన్నాడు. చివరకు అందరూ కలిసి ఆడటం మొదలుపెట్టారు. మ్యాచ్ మొదలయ్యాక మరో సమస్య. 

బౌలర్‌ బంతిని సాధించగా.. బ్యాటర్‌ దానిని కవర్స్‌ దిశగా భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అది కాస్తా మిస్‌ అయ్యి వికెట్‌కీపర్‌ చేతుల్లోకి వెళ్తుంది. అప్పుడు ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాళ్లందరూ ఔట్ అంటూ అప్పీల్ చేయగా.. అంపైర్ నో అంటూ అడ్డంగా తల ఊపుతాడు. అంపైర్‌ నిర్ణయంతో సంతృప్తి చెందని బౌలింగ్‌ టీమ్‌ కెప్టెన్.. రివ్యూ తీసుకుంటాడు. థర్డ్‌ అంపైర్‌ రీప్లేను అల్ట్రా ఎడ్జ్ టెక్నాలజీతో పరిశీలించి ఔట్‌గా ప్రకటిస్తాడు. దీంతో ఫీల్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటాడు. ఇలాంటి ఆలోచనలు రావడమే గొప్ప అంటే.. దీనిని ఆచరణలో పెట్టిన కుర్రాళ్లను అభినదించాల్సిందే. ఈ వీడియోను మీరూ చూసి ఎలా ఉందో చెప్పేయండి.