ఢిల్లీని వణికిస్తున్న రైతుల డిమాండ్లు ఏంటి..?

ఢిల్లీని వణికిస్తున్న రైతుల డిమాండ్లు ఏంటి..?

ఢిల్లీలో గత వారం రోజులుగా రైతుల నిరసన సెగలు కమ్ముకొస్తున్నాయి. 2020-లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 3 రైతు చట్టాలకు రైతుల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. నెలల తరబడి రైతులు ఉద్యమించారు. పంజాబ్, హర్యాలు భారతీయ కిసాన్ యూనియన్ ఆ ఉద్యమానకి నాయకత్వం వహించారు.  పంజాబ్, హర్యాన, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ ఉత్తర భారత దేశంలో ఈ మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని నెలలపాటు రైతులు ఉద్యమించారు. ఈ పోరాటంలో అన్నదాతలు విజయం సాధించారు. 2021లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మూడు చట్టాలను ప్రధాని మోదీ వెనక్కి తీసుకున్నారు.

రైతులలో పాట్లాడి వారి ఇతర డిమాండ్లకు కూడా సానుకూలంగా స్పందించారు. పంటకు కనీస మద్దతు ధర కల్పిస్తామని అప్పుడు కేంద్రం రైతు సంఘాలతో చెప్పింది. మూడు సంవత్సరాలు కావస్తున్నా  MSP కి నిర్ణయం తీసుకొలేదని సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఫిబ్రవరి 13న ఛలో ఢిల్లీ పాదయాత్రకు పిలుపునిచ్చాయి. దీంతో వేలదిగా రైతులు ట్రాక్టర్లతో ఢిల్లిలో పార్లమెంట్ ముట్టడికి బయలు దేదారు. సుమారు 30వేల పోలీసులు ఢిల్లీ సరిహద్దుల చుట్టూ భారీ బంధోబస్తూ ఏర్పాటు చేశారు. నిరసనకారులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా బారికేట్లు, రబ్బరు బులెట్స్, టియర్ గ్యాస్, వాటర్ కనాన్లు, ముల్ల కంచెలు పఠిష్టమైన రక్షణ గోడలు కట్టారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 10రోజులుగా రాజధాని పరిసర ప్రాంతాలు ఉద్రిక్తత వాతావరణం ఉంది.

నాల్గవ సారి రైతులతో మంత్రుల చర్చలు
 ఇప్పటి వరకు మూడు సార్లు ముగ్గురు కేంద్ర మంత్రులతో రైతు సంఘాల నాయకులు చర్చలు జరిపారు. అయినా ఫలించలేదు. ఈ రోజు నాల్గవ సారి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రైతులతో భేటీ కానున్నారు. 

రైతుల డిమాండ్లు ఏంటి ?
 > పంటలకు కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చే చట్టం. ఇది రైతులకు ఇది కీలకమైన జీవనాధారం.
 > విద్యుత్ సవరణ చట్టం 2020ని రద్దు చేయాలి.
> ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీలో మృతి చెందిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి.
> 2020లో రైతుల ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదైన కేసుల్ని ఉపసంహరించుకోవాలి.
> స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి.
> రైతులకు రుణమాఫీ చేయాలి.
> భూ సేకరణ చట్టం 2013