
తమన్నా(Tamannaah) లీడ్ రోల్లో నటించిన ‘జీ కర్దా’ (Jee Karda) వెబ్ సిరీస్ హాట్ టాపిక్‌గా మారింది. సిరీస్‌లో ఇంట్రెస్టింగ్గా సాగే ట్విస్టులు ఇందుకు ఓ కారణమైతే.. గతంలో ఎన్నడూ లేని విధంగా తమన్నా గ్లామర్ డోస్ పెంచేయడం మరో కారణం. ఈ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నా తమన్నా చేసిన హాట్ షో వివాదాస్పదమవుతోంది.
దీంతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఈ మిల్కీ బ్యూటీ స్పందించింది. ఈ సిరీస్‌లో బోల్డ్ సీన్స్ చాలా అవసరమని తెలిపింది. ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్‌ను చాలా న్యాచురల్‌గా చూపించే ప్రయత్నంలో ఈ సన్నివేశాలు తెరకెక్కించినట్టు వివరించింది. ఇది నచ్చినా నచ్చకపోయినా కథలో భాగంగానే చూడాలని పేర్కొంది. ‘లస్ట్ స్టోరీస్ 2’ (Lust Stories 2) అనే మరో వెబ్ సిరీస్‌లోనూ తమన్నా ఇంటిమేట్ సీన్స్‌లో నటించింది. దీంతో కాంట్రవర్సీలతోనే పాపులారిటీ తెచ్చుకుంటోంది.