ప్రజలు చస్తుంటే కేంద్రం ఏం చేస్తున్నట్లు? 

ప్రజలు చస్తుంటే కేంద్రం ఏం చేస్తున్నట్లు? 

న్యూఢిల్లీ: నాగాలాండ్ లోని మోన్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. 13 మంది పౌరులు, ఓ జవాన్ మృతిపై రాహుల్ సంతాపం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై కచ్చితంగా వివరణ ఇవ్వాలని రాహుల్ డిమాండ్ చేశారు. సొంత భూభాగంలో పౌరులు, భద్రతా సిబ్బంది సురక్షితంగా లేనప్పుడు.. అసలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. 

ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా స్పందించారు. కాల్పుల ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపిన దీదీ.. గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరగాలని.. ఘటనపై లోతైన స్థాయిలో విచారణ జరపాలన్నారు.