health tips: రోజూ గుప్పెడు గింజలు(నట్స్)తింటే.. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్..ముఖ్యంగా మీ గుండె ఆరోగ్యం

health tips: రోజూ గుప్పెడు గింజలు(నట్స్)తింటే.. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్..ముఖ్యంగా మీ గుండె ఆరోగ్యం

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. ఆరోగ్యం దెబ్బతింటే దానంత నష్టం ఇంకోటి లేదు..అందుకు ఆరోగ్యం శ్రద్ధ పెట్టడం మంచిది.రోజూ శారీరక శ్రమ,  మంచి ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించొచ్చు అంటున్నారు డాక్టర్లు. మరి ఎలాంటి పుడ్​ తీసుకోవాలి అనే దానిపై అనేక సందేహాలు..గింజలు(నట్స్)..ఆరోగ్యం, వ్యాధుల నివారణలో కీ రోల్​ పోషిస్తాయి. నట్స్​ తింటే కలిగే ఆరోగ్య కరమైన ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..

నట్స్​పోషకాలతో నిండిఉంటాయి. అసంతృప్త కొవ్వులు, ఆమ్లాలు, ఫైబర్లు, ఖనిజాలు, టోకోఫెరాల్స్​, ఫైటోస్టోరాల్స్, ఫినోలిక్​వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ 30 గ్రాముల నట్స్​(గింజలు) తింటే ఆరోగ్యానికి కావాల్సిన మొత్తం పోషకాలు అందుతాయి. ఒత్తిడిని, మానసిక వైకల్యం ప్రమాదాన్ని 17 శాతం తగ్గించొచ్చు అంటున్నారు డాక్టర్లు. 

ఎయిమ్స్, హార్వర్డ్ , స్టాన్‌ఫోర్డ్‌లో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి తెలిపిన వివరాల ప్రకారం..  ప్రతిరోజూ కేవలం 30 గ్రాముల ఉప్పు లేని గింజలను తినడం వల్ల రకరకాల కారణాలతో వచ్చే చిత్తవైకల్యం ప్రమాదం17శాతం తగ్గుతుందంటున్నారు. 

రోజూ 30 గ్రాముల గింజలు తింటే కలిగే బెనిఫిట్స్​.. 

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది ..గింజల్లో ఉన్న ఓమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుండెకు మేలు చేస్తాయి.
కణాల రక్షణ ..యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ని తగ్గిస్తాయి.
జీర్ణశక్తి పెరుగుతుంది ..ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియ సులభం అవుతుంది.
మెదడు ఆరోగ్యానికి మేలు ..ఆల్మండ్స్‌, వాల్‌నట్స్‌ వంటి గింజలు మెమరీని మెరుగుపరుస్తాయి.
బరువు నియంత్రణలో.. తక్కువ పరిమాణంలో ఎక్కువ శక్తి ఇస్తాయి.
షుగర్​ కంట్రోల్​..గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల షుగర్ స్థాయిలను నియంత్రిస్తాయి.

గింజలు తినే విధానం..

రోజుకు సుమారు 30 గ్రాములు(పిడికెడు) ఉప్పు లేని గింజలు తీసుకోవాలి.
బాదం 20, వాల్‌నట్14, పిస్తా 30 , కాజూ15  , హేజల్‌నట్ 20  గింజల మిశ్రమం తీసుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి.
ఉప్పు లేదా వేయించిన గింజలను కాకుండా నేచురల్ లేదా డ్రై-రోస్ట్ రూపంలో తీసుకోవడం మంచిది.