27 ఏళ్లకే ముసలివాళ్లయ్యారా : షోయబ్

27 ఏళ్లకే ముసలివాళ్లయ్యారా :  షోయబ్

కరాచీ: పాక్ యంగ్ క్రెకెటర్ మహ్మద్ ఆమిర్ టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆమిర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాడు ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. ప్రస్తుతం పాక్ టీమ్ బలహీనంగా ఉందని..అందులో చెప్పుకోదగ్గ బౌలర్ ఆమిర్ టెస్టు క్రికెట్ కు దూరం కావడంపై సీరియస్ అయ్యాడు. 27 ఏళ్లకే ముసలివాళ్లు అయ్యారా అంటూ చురకలంటించాడు.

ఇలాంటివారిని అసలు ఏ ఫార్మాట్ లోనూ ఆడనీయకూడదని అభిప్రాయం తెలిపాడు. తాను సెలక్షన్ కమిటీలో ఉంటే సడెన్ గా ఇలాంటి నిర్ణయాలను తీసుకునే క్రికెటర్లను ఏ ఫార్మాట్ లోనూ సెలక్ట్ కాకుండా చేసేవాడినని చెప్పాడు. ఆమిర్ కు ఎంతో వయసు ఉందన్న ఆయన ..టెస్టులకు దూరంకావడం సరైన నిర్ణయం కాదన్నాడు. ఇప్పటికే పాక్ టీమ్ చాలా వీక్ గా ఉందన్న షోయబ్..ఇక పాక్ ను ప్రధాని ఇమ్రాన్ ఖానే బతికించాలి అని చెప్పుకోచ్చాడు.

వరల్డ్ కప్ లో ఆమిర్ తనదైన స్టైల్లో బౌలింగ్ వేసి ఆకట్టుకున్న విషయం తెలిసిందే.