జీర్ణవ్యవస్థ దెబ్బ తింటే ఆరోగ్యం మొత్తంగా పాడవుతుంది. అది సక్రమంగా పని చేయాలి అంటే పొట్టలో ఉండే చిన్న పేగుల పని తీరు చక్కగా ఉండాలి. లేకుంటే తిన్న ఆహారం జీర్ణం కాదు. వాంతులు.. విరేచనాలే కాకుండా బోలెడు వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. దీన్నే సెలియాక్ డిసీజ్ అంటారు. దీనివల్ల వెంటనే ప్రమాదమేమీ లేకపోయినా అశ్రద్ధ చేస్తే మాత్రం పెద్ద వ్యాధులే వస్తాయి.
పొద్దున లేచిన దగ్గర్నించి రాత్రి పడుకోబోయే వరకూ ఏదో ఒకటి తింటూనే ఉంటాం తిన్నది సరిగ్గా అరక్కపోతే వాంతులు, విరేచనాలు పట్టుకుంటాయి. దానికితోడు పొట్టలో నొప్పి కూడా మొదలవుతుంది. మనం రోజూ తినే ఆహారంలో ఉండే పదార్థాలు పేగులకు చుట్టుకోవడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. దీన్ని గుర్తించడం కొంచెం కష్టం అంటున్నారు వైద్యులు. నొప్పి వచ్చినప్పుడు డాక్టరు దగ్గర వెళ్లి అతడు చెప్పిన మందులేసుకుంటే తగ్గుతుంది. కానీ అంతవరకూ తెచ్చుకోవడం ఎందుకు? తినే పదార్థాలతోనే జాగ్రత్తగా ఉంటే పోలా?
ఎవరికి ఎక్కువ
కడుపునొప్పి చిన్న పిల్లల్లో, పెద్దవాళ్లలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల్లో జీర్ణవ్యవస్థ సరిగా వృద్ధి చెందకపోవడం పట్ల వస్తుంది. పెద్దవాళ్లలో అయితే పేగుల్లో పని సాంద్రత తగ్గడం వల్ల వస్తుంది. వయసు పైబడే కొద్దీ వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతూ ఉంటుంది. అందుపల్ల పెద్దవాళ్లకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
కలిగే లక్షణాలు
జీర్ణలోపం వల్ల విరే చనాలు బరువు తగ్గడం,కడుపు ఉబ్బరంగా అని పిస్తుంది. దాంతో పెద్దవారిలో రక్తహీ నత ఏర్పడి నీరసించి పోతుంటారు. చర్మం పాలిపోతుంది. శ్వాసలో కూడా తేడా వస్తుంది. ఆకలి మందగి స్తుంది. చిన్న పిల్లలు నీరసించి ఎండిపోయినట్టు అవుతారు. కొంతమందికి నీరసంతో మూర్చ కూడా వస్తుంది.
ఎందుకు వస్తుంది
పొట్టలో ఉండే చిన్న పేగులకు గ్లూటెన్ అనే పదార్థం అతుక్కుపోవడం వల్ల కడుపు నొప్పి మొదలవుతుంది. ఇది ముఖ్యంగా వరి, గోధుమ, బార్లీ, పాస్తా, తృణ ధాన్యాలలో ఉంటుంది. ఇది బబుల్ గమ్ లా ఉండి పేగులను చుట్టేస్తుంది. దానివల్ల ముఖ్యమైన పోషకాలు పేగులను చేరకుండా వ్యర్ధమైపోతాయి. దాంతో శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. పోషకాలు అందకపోతే వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. ఈ లక్షణాలు సెలియాక్ డిసీజ్ కి దారితీస్తాయి.
వచ్చే వ్యాధులు
పోషకాహారం లోపం వల్ల అనీమియా వస్తుంది. ఐరన్, ఫోలేట్, క్యాల్షియం, కొవ్వు కరిగించే విటమిన్లు అందకపో వడం పట్ల బరువు పెరుగుతారు. ఎముకలు గుల్ల వారి పోతాయి. దాని వల్ల బోన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. థైరాయిడ్, నాడీ సంబంధిత వ్యాధులు
కూడా వస్తాయి
డాక్టర్ దగ్గరకు ఎప్పుడు వెళ్లాలి
- రెండు మూడు కంటే ఎక్కువ విరేచనాలు
- తిన్న మొటనే వాంతి లేదా విరేచనం.
- ఎక్కువ నీరసం
- తీవ్రమైన కడుపు నొప్పి
- ఎక్కువుగా కళ్లు తిరిగి పడిపోతున్నప్పుడు డాక్టర్ని సంప్రదించాలి.
ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే చిన్నపేగును బయాప్సీ చేయడం ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారు. దీనికి చికిత్స సులభమే. సమయానికి మందులు తీసుకుని, ఆరోగ్య నియమాలు పాటిస్తే త్వరగా కోలుకుంటారు.
ఏమి తినాలి..
గ్లూటెన్ ఎక్కువుండే పదార్థాలను తినడం మానేయాలి. డి విటమిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తినాలి. కాయగూరలు, ఆకు కూరలు, గుడ్లు, తేనె, యాపిల్స్, అరటి పళ్లు తీసుకోవాలి. మంచినీళ్లు ఎక్కువ తాగాలి.
–వెలుగు, లైఫ్–
