మీకు తెలిస్తే చెప్పండి: సోషల్ మీడియాను ఊపేస్తున్న ప్రశ్న.. కోట్ల మంది సమాధానాలు

మీకు తెలిస్తే చెప్పండి: సోషల్ మీడియాను ఊపేస్తున్న ప్రశ్న.. కోట్ల మంది సమాధానాలు

మ్యాథ్స్(గణితం).. ఈ మాట వింటే చాలు అమ్మో అంటారు. అలాంటి ప్రశ్నే ఇది.. ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది.. ఇప్పటికే కొన్ని కోట్ల మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు.. అందరిదీ ఒకే సమాధానం కాలేకపోయింది.. గూగుల్ ఒక సమాధానం ఇస్తే.. చాట్ జీపీటీ వర్ణణతో సహా మరో ఇన్సర్ ఇచ్చింది.. ఇంతకీ ఆ క్వశ్చన్ ఏంటీ అంటారా.. 

క్వశ్చన్ : What is the Closest Time to Midnight ?
క్వశ్చన్ :  అర్థరాత్రికి దగ్గర సమయం ఏంటీ..?

  • ఏ). 11:55 AM
  • బి). 12:06 AM
  • సి). 11:50 AM
  • డి). 12:03 AM

ఈ ప్రశ్న సమాధానంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.  ప్రశ్న అంత క్లిష్టతరమైంది కాకపోయినప్పటికీ.. అసంపూర్థిగా ఉండటం కారణంగా స్పష్టమైన సంధానం ఏదనేది తేలడం లేదు. లక్షల సంఖ్యలో సమాధానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరికి తోచింది వాళ్లు చెబుతున్నారు. చివరకు రెండు సమాధానాలపైనే వర్గాలుగా విడిపోయారు నెటిజన్లు.
 
ఆన్సర్ 1: 11:55 AM ఎక్కువ మంది అర్థరాత్రికి ఇదే దగ్గర సమయమని సమాధానం ఇస్తున్నారు. ప్రశ్నలో అర్థరాత్రికి దగ్గరగా అంటున్నారు తప్ప..  అర్థరాత్రి తర్వాత కాదని వీరి వాదన.అందునా టైం ట్రావెలింగ్ అనేది ముందుకే(క్లాక్ వైస్ డైరెక్షన్) ఉంటుంది కనుక సమాధానం Aనే కరెక్ట్ అని వాదిస్తున్నారు.

ఆన్సర్ 2: 12:03 AM. మరికొందరు ప్రశ్నను బట్టి అర్థరాత్రికి ఇదే సమయం అని చెప్తున్నారు. అర్థరాత్రి ముందా.. వెనకా అన్న సందేహం ప్రశ్నలో లేదు కనుక ఆన్సర్ D అని వాదిస్తున్నారు.

చాట్ జీపీటీ: కృత్రిమ మేధ చాట్ జిపిటీ కూడా సమాధానం D కరెక్ట్ అని చెప్తోంది. ప్రశ్నలో అర్థరాత్రికి దగ్గర సమయం అని అడిగారు తప్ప డైరెక్షన్ అడగలేదని వర్ణణ కూడా ఇస్తోంది. ఇంతకూ ఈ  ప్రశ్నకు మీ సమాధానమేంటో కామెంట్లలో తెలియజేయండి.

ALSO READ: నిజామాబాద్లో స్పీడందుకున్న నామినేషన్లు