విద్యుత్​ ఉద్యోగుల విభజన ఇంకెన్నడు?

విద్యుత్​ ఉద్యోగుల విభజన ఇంకెన్నడు?

రంగారెడ్డి జిల్లా, వెలుగు: విద్యుత్ ఉద్యోగుల విభజన వెంటనే పూర్తిచేయాలని తెలంగాణ స్టేట్​ పవర్​ఎంప్లాయిస్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్ పి.రత్నాకర్​రావు అన్నారు. విద్యుత్‌‌ ఇంజనీర్స్‌‌ భవనంలో అసోసియేషన్​ ఆధ్వర్యంలో సోమవారం  భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్బంగా రత్నాకర్‌‌ రావు మాట్లాడుతూ.. ఉద్యోగుల విభజన వెంటనే పూర్తిచేయాలని ఆయన డిమాండ్​ చేశారు.

సుప్రీంకోర్టు ధర్మాధికారి కమిటీ వచ్చే నెల 4, 5 తేదీల్లో సమావేశం కానుందని గుర్తుచేశారు. కమిటీ నిర్ణయాన్ని బట్టి తదుపరి కార్యాచరణ నిర్ణయించుకుంటామని ఆయన వివరించారు. తెలంగాణ ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీసేలా నిర్ణయంతీసుకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. పవర్‌‌ ఎంప్లాయిస్‌‌ యూనియన్‌‌ సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.