ఓపెన్‌హైమర్ సినిమాకు భగవద్గీతకు లింక్.. ఆ పాత్ర కోసం మొత్తం చదివాడట

ఓపెన్‌హైమర్ సినిమాకు భగవద్గీతకు లింక్.. ఆ పాత్ర కోసం మొత్తం చదివాడట

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా ఓపెన్‌హైమర్(Oppenheimer). దర్శకుడకు క్రిస్టోఫార్ నోలన్(Christopher Nolan) తెరెకక్కిస్తున్న ఈ సినిమాలో సిలియన్ మర్ఫీ(Cillian Murphy) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా జులై 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు.. ఓపెన్‌హైమర్ సినిమాకు భారతీయ ఇతిహాసాల్లో ఒకటైన భగవద్గీత(Bhagavad Gita)కు ఒక లింక్ ఉందట. అందుకే ఈ సినిమాలో ఒక పాత్రను అర్థం చేసుకునేందుకు నటుడు  సిలియన్ మర్ఫీ భగవద్గీత మొత్తాన్ని చదివారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఈ భగవద్గీతకు, ఓపెన్‌హైమర్ సినిమాకు ఉన్న లింక్ ఏంటి అనేది తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నెటిజన్స్.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే. రెండో ప్రపంచయుద్ధ సమయంలో ప్రజలందరినీ భయపెట్టిన సంఘటన అణుబాంబు తయారీ. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ అణుబాంబు తయారీకి స్ఫూర్తి భగవద్గీతనేనట.  అణుబాంబు  సృస్తికర్త రాబర్ట్ ఓపెన్ హోమర్ భగవద్గీతలోని ఒక శ్లోకం నుండి స్ఫూర్తి పొంది అణుబాంబు ను తయారుచేశారట. ఆ శ్లోకం ఏదంటే.. "సృష్ఠించింది నేనే నాశనం చేసింది నేనే".  ఈ అణుబాంబు తయారీపైనే దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఓపెన్‌హైమర్ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు.

ఇక తాజాగా ఈ విషయంపై నటుడు సిలియన్ మర్ఫీ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఓపెన్‌హైమర్ ను అర్థం చేసుకోవడానికి భగవద్గీత మొత్తం చదివాను. భగవద్గీత  అనేది చాలా అందమైన వచనం, స్ఫూర్తిదాయకంగా ఉంది" అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.