ప్రభాస్ నెక్ట్స్ ప్రాజెక్ట్ కె అంటే ఏంటి.?

ప్రభాస్ నెక్ట్స్ ప్రాజెక్ట్ కె అంటే ఏంటి.?

వరుస ప్యాన్‌‌ ఇండియా సినిమాలను లైన్‌‌‌‌‌‌‌‌లో పెట్టిన ప్రభాస్‌‌‌‌‌‌‌‌, ‘రాధేశ్యామ్‌‌‌‌‌‌‌‌’ రిలీజ్ కావడంతో మిగతా చిత్రాలపై ఫోకస్ పెడుతున్నాడు. వీటిలో ‘ఆదిపురుష్‌‌‌‌‌‌‌‌’ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. సాలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వీలైనంత వేగంగా వీటిని కంప్లీట్ చేయబోతున్నాడు. నాగ్ అశ్విన్‌‌‌‌‌‌‌‌ డైరెక్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ మూవీ టైటిల్‌‌‌‌‌‌‌‌ని ఇంతవరకు రివీల్ చేయకపోవడంతో ‘కె’ అంటే ఏమై ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది. దాని గురించి ఇప్పడొక ఇంటరెస్టింగ్ విషయం బైటికొచ్చింది. ‘కె’ అంటే ‘కల్కి’ అని, ఇదే ఫైనల్ టైటిల్ అని బజ్‌‌‌‌‌‌‌‌ వినిపిస్తోంది. ఇదో సైన్స్ ఫిక్షన్ మూవీ. ప్రభాస్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోగా నటిస్తున్నాడు. పురాణాలు, ఇతిహాసాలకు ట్రైమ్ ట్రావెల్‌‌‌‌‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ని మిక్స్ చేసి  తీస్తున్నాడు నాగ్ అశ్విన్. అందుకే కలియుగానికి సంబంధించి పురాణాల్లో చెప్పిన ‘కల్కి’ టైటిల్‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేశారట. సినిమాలో ప్రభాస్‌‌‌‌‌‌‌‌ పేరు కూడా అదేనట. దీపికా పదుకొనె హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషిస్తున్నారు.