రేప్ చేస్తే ఏ దేశంలో ఏ శిక్ష?

రేప్ చేస్తే ఏ దేశంలో ఏ శిక్ష?

మనదేశంలో ఉన్న చట్టాలు పాత కాలం నాటివి. మనం ఇంకా వాటినే పాటిస్తున్నాం. మన దేశంలో ఏ నేరం చేసినా ఉరి శిక్ష విధించే అవకాశం చాలా తక్కువ. కొన్నిసార్లు మాత్రమే ఉరిశిక్షను అమలు చేస్తారు. దాన్ని ఆసరగా చేసుకొని చాలా మంది భయంలేకుండా వికృత చేష్టలకు దిగుతున్నారు. మారిన కాలానికి అనుగుణంగా చట్టాల్ని కూడా మార్చకోవాల్సిన అవసరం చాలా ఉంది.

ఢిల్లీలో 2012 డిసెంబర్‌లో ఓ యువతిని దారుణంగా అత్యాచారం చేసి, ఆమె మృతికి కారణమయ్యారు కొంతమంది యువకులు. ఆ యువతి చనిపోవడంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘నిర్భయ’ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చి ఏడేళ్లు గడుస్తున్నా నిర్భయ నిందితులకు మాత్రం శిక్ష అమలుకాలేదు. కేసు కోర్టులో ఉండగానే రామ్ సింగ్ అనే నిందితుడు జైలులోనే ఉరి వేసుకొని చనిపోయాడు. ఒక నిందితుడు మాత్రం మైనర్ కావడంతో అతన్ని జువైనల్ కోర్టుకు తరలించి, ఆ తర్వాత విడుదల చేశారు. మిగతావారు మాత్రం ఇంకా జైలులోనే ఉన్నారు. కేసు ఇంకా నడుస్తూనే ఉంది.

రేప్ చేస్తే మహా అయితే జైలు శిక్ష వేస్తారు అనే చులకన భావంతో కొంతమంది రెచ్చిపోతున్నారు. అలా కాకుండా అత్యాచారానికి కూడా మరణశిక్ష లాంటి వాటిని అమలు చేస్తే తప్ప మార్పు రాదు. కొన్ని దేశాలు అత్యాచారాన్ని తీవ్ర నేరంగా పరిగణించి ఉరి శిక్షను అమలు చేస్తున్నాయి. మన దగ్గర కూడా అత్యాచారాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించి, కఠినమైన శిక్షలు అమలు చేస్తేనే మంచిదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

MORE NEWS:

షీ టీమ్ నంబర్ ఇదే.. మన బిడ్డలకు చెప్పండి

షాద్‌నగర్‌ పీఎస్ దగ్గర నిరసనకారులపై లాఠీచార్జ్

హైదరాబాద్‌లో డాక్టర్ అత్యాచారం, హత్యపై రగిలిపోయిన జనాలు.. నిందితులున్న పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. ‘వారిని మాకు అప్పగిస్తారా? మీరు ఎన్‌కౌంటర్ చేస్తారా? చూస్తూ ఉంటే మానవ మృగాల ఆగడాలు ఆగవు.. షాద్ నగర్ నుంచే అత్యాచార నిందితుల్ని చంపేయడాన్ని ప్రారంభిద్దాం’ అంటూ జనాలు ఆగ్రహంతో రోడ్డెక్కారు. జనాన్ని కంట్రోల్ చేసి నిందితుల్ని జైలుకు తరలించడం పోలీసులకు నిన్న పెద్ద సవాలుగా మారింది. బయటి దేశాలలోలాగా నిందితుల్ని వెంటనే శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. కొన్ని దేశాలలో నిందితుల తలలు కూడా బహిరంగంగా నరికేస్తారు.

రేప్ చేస్తే ఏ దేశంలో ఏ శిక్షలు అమలులో ఉన్నాయో ఓ సారి చూద్దాం..
అమెరికా: ఇక్కడ అత్యాచార నిందితులకు గరిష్టంగా 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. చిన్నపిల్లలపై అత్యాచారం చేస్తే మాత్రం మరణశిక్ష విధిస్తారు.
రష్యా: నిందితులకు 4 నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశముంది. ఇటువంటి కేసులలో అరెస్టయిన వారికి 20 సంవత్సరాల వరకూ ఎటువంటి ఉద్యోగమూ ఇవ్వరు.
జపాన్: అత్యాచారం చేస్తే 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. అత్యాచారంతో పాటు దోపిడి కూడా చేస్తే మాత్రం మరణశిక్షే.
నార్వే: ఇక్కడ నిందితులకు 4 నుంచి 15 ఏళ్ల కఠినశిక్ష విధిస్తారు.
నెదర్లాండ్స్: ఇక్కడ ఫ్రెంచ్ కిస్‌ను రద్దు చేశారు. నిబంధనల్ని ఉల్లఘించి ప్రవర్తిస్తే అత్యాచారంగా భావించి 4 నుంచి 15 ఏళ్ల శిక్ష విధిస్తారు.
బంగ్లాదేశ్: నిందితులకు జీవిత ఖైదు విధిస్తారు. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే మరణశిక్ష విధిస్తారు.
పాకిస్తాన్: గ్యాంగ్ రేప్, పిల్లలపై అత్యాచారం కేసులకు మరణశిక్ష విధిస్తారు. మహిళలపై దాడులకు దిగి, వారి అవయవాలు కనిపించేలా చేసినా కూడా మరణశిక్షే విధిస్తారు.
ఫ్రాన్స్: ఇక్కడ బాధితురాలు మరణిస్తే 30 ఏళ్ల జైలు శిక్ష నుంచి జీవితఖైదు విధిస్తారు. తక్కువలో తక్కువగా 15 ఏళ్ల శిక్ష విధిస్తారు.
అఫ్గానిస్థాన్: నిందితులకు శిక్ష 4 రోజుల్లోనే అమలు చేస్తారు. ఒక్కోసారి బాధితుల ద్వారానే నిందితుల్ని శిక్షిస్తారు. గన్‌తో తలలో కాల్చడం లేదా ఉరి తీస్తారు.
ఇజ్రాయిల్: ఇక్కడ ఏవిధమైన లైంగిక నేరం చేసినా 16 ఏళ్ల వరకు జైలు శిక్షను అమలు చేస్తారు.
క్యూబా: ఒకసారి అత్యాచారం కేసులో ఇరుక్కొని.. మరోసారి అత్యాచారం చేసినా లేదా 12 ఏళ్లలోపు పిల్లలపై అత్యాచారం చేసినా ఉరిశిక్ష వేస్తారు.
చైనా: ఇక్కడ అత్యాచారాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. విచారణ వేగంగా పూర్తి చేసి దోషుల్ని శిక్షిస్తారు. తుపాకీతో కాల్చడం లేదా పురుషాంగాన్ని తొలగించే శిక్షను విధిస్తుంటారు.
ఉత్తర కొరియా: నిందితుల మర్మాంగలపై తుపాకీతో కాల్చి చంపుతారు. కొన్నిసార్లు తలపై కూడా కాలుస్తుంటారు. ఇక్కడ దాదాపు మరణశిక్షలే విధిస్తారు.
ఇరాన్: అత్యాచార నిందితులకు ఉరి శిక్ష లేదా తుపాకీతో కాల్చడం వంటి శిక్షలు విధిస్తారు. అవి కూడా బహిరంగంగా అమలుచేస్తారు. బాధితుల అనుమతితో ఒక్కోసారి మరణశిక్షను రద్దు చేస్తారు. అటువంటప్పుడు మాత్రం 100 కొరడా దెబ్బలు కొడతారు.
సౌదీ అరేబియా: నిందితులకు మత్తు మందు ఇచ్చి బహిరంగంగా తల తీసేస్తారు. కొన్నిసార్లు రాళ్లతో కూడా కొట్టి చంపుతారు. బాధితుల అనుమతితో మరణశిక్షను రద్దు చేసే అవకాశం ఉంది.
ఈజిప్టు, యూఎఈ: నిందితుడికి 7 రోజుల్లోనే మరణశిక్షను అమలు చేస్తారు.

సంబంధిత వార్తల కోసం..

ప్రియాంక ఎలా చనిపోయిందో తల్లికి చెప్పిన పాషా

మా కొడుకులను వదలొద్దు