వాట్సప్లో కొత్త ఫీచర్.. సెర్చింగ్ కోసం యూజర్ నేమ్

వాట్సప్లో కొత్త ఫీచర్.. సెర్చింగ్ కోసం యూజర్ నేమ్

ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ వినియోగదారులకోసం కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఫోన్ నంబర్లకు బదులుగా యూజర్ నేమ్ లను ఉపయోగించి సెర్చ్ చేసి ఇతరులతో వినియోగదారులు కనెక్ట్ అవ్వొచ్చు. వాట్సప్లో పరిచయాలు పెంచుకునేందుకు ఫోన్ నంబర్లకు బదులుగా యూజర్నేమ్తో సెర్చింగ్కు కస్టమర్లను అనుమతిస్తుంది.

వినియోగదారులు తమ నంబర్ కు బదులుగా వాట్సప్ లో యూజర్ నేమ్ ను ఉపయోగించాలనేది పూర్తిగా వారి వ్యక్తిగతం.. యూజర్ నేమ్ ను కావాలనుకుంటే  మార్చుకోవచ్చు.. కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. వినియోగదారులు తమ ఫోన్ నంబర్ ను వెల్లడించకుండా వాట్సప్ ను వినియోగించాలనుకునేవారికి ఇది మంచి ఫీచర్. తద్వారా వ్యక్తిగత సమాచారంపై మరింత నియంత్రణ ఉంటుంది.

ఈ ఫీచర్  వినియోగదారులు స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతర పరిచయాలకోసం కనెక్ట్ అయ్యే ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది. దీంతోపాటు కస్టమర్ ఫోన్ నంబర్లు లేకుండానే వారి పేర్లను పంచుకోవడం ద్వారా  ఇతరులను సెర్చింగ్ చేసి కనెక్ట్ అవడం మరింత సులభతరం అవుతుంది.ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం డెవలపింగ్ దశలో ఉంది.

వినియోగదారుల సౌలభ్యం కొరకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తు్న్న వాట్సప్ యాజమాన్యం మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ వాట్సప్ చాట్ లాక్ కోసం రహస్య కోడ్ ఫీచర్ ను ప్రవేశపెట్టారు. ఈ ఫీచర్ ప్రత్యేకమైన కోడ్ ద్వారా చాట్ లను దాచుకునేందుకు ఉపయోగపడుతుంది. సెర్చ్ బార్ లో కోడ్ ని నమోదు చేసి మాత్రమే ఈ లాక్ చేయబడిన చాట్ లు కనిపిస్తాయి.