Ganesh Chaturdhi 2025: ఏ ఆకారం విగ్రహానికి పూజలు చేస్తే.. ఫలితాలు ఎలా ఉంటాయి..!

Ganesh Chaturdhi 2025: ఏ ఆకారం  విగ్రహానికి పూజలు చేస్తే.. ఫలితాలు ఎలా ఉంటాయి..!

Vinayakachaviti 2025: దేశ వ్యాప్తంగా వినాయకచవితి పండుగ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.  మండపాల నిర్వాహకులు  విగ్రహాలను పూజస్థలానికి చేరవేసుకుంటున్నారు.  గల్లీ గల్లీలో భారీగా పందిళ్లు వేసి తొమ్మిది రాత్రుళ్లు ఘనంగా నిర్వహించినా... ప్రతి ఇంటిలో కూడా వినాయక ప్రతిమను ప్రతిష్టించి పూజలు చేస్తారు.     అయితే వినాయచవితి రోజు పూజించే విగ్రహం ఎలా ఉండాలి.. ఎలాంటి ఆకారంలో ఉన్న విగ్రహానికి పూజలు చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది.  జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం... ఏ ఆకృతి వెనుక ఎలాంటి ఆంతర్యం ఉందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . 

 వినాయక చవితి పండుగ రోజు భక్తులు తమ కంటికి నచ్చినది...  స్తోమతకు తగ్గట్టు గణేషుడి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజిస్తారు.. శ్రీవిశ్వావశునామ సంవత్సరం ( 2025) లో వినాయక చవితి... గణేష్​ చతుర్ధి పండుగను ఆగస్టు 27 బుధవారం నాడు జరుపుకొనేందుకు హిందువులు సిద్దమయ్యారు.  గణేశుడి పండుగ అంటే పిల్లల సందడి అంతా ఇంతా కాదు..  వినాయకుడి ప్రతిమ.. పత్రి.. ఇలా ఎక్కడ చెట్టు కనపడితే అక్కడ వాలిపోతారు.  ఇదంతా ఎలా ఉన్నా.. గణేశుడి విగ్రహం తెచ్చుకొనేటప్పుడు  కొన్నింటిని పరిశీలించాలి.   వినాయకుడి ఆకృతి పూజచేస్తే ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. 
 
వాస్తు దోషం తొలగాలంటే:  వినాయకచవితి రోజు తొండం ఎడమ వైపునకు ఉండే విగ్రహానికి పూజ చేస్తే  వాస్తు దోషాలు తొలగిపోయి .. ప్రతి పనిలో కూడా విజయం వరిస్తుంది. 

కోరికలు తీరేందుకు :  వినాయకుడి తొండం కుడివైపునకు ఉండే విగ్రహానికి పూజలు చేస్తే  ఎంతో కాలంగా పెండింగ్​ లో ఉన్న కోరికలు తీరి.. సంతోషంగా గడుపుతారని పండితులు చెబుతున్నారు. అయితే ఇలాంటి విగ్రహాన్ని పూజించేటప్పడు దీక్షా నియమాలను పాటించాలి.. లేకపోతే కొత్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. 

తొండం మధ్యలో  ఉంటే:  వినాయకచవితి రోజు ఇలాంటి విగ్రహానికి పూజలు చేస్తే ఇంట్లో ఉండే నెగిటివ్​ ఎనర్జీ తొలగుతుంది.  ఇంకా ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి.  దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుందని పురాణాల్లో ఉందని పండితులు చెబుతున్నారు. 

ప్రశాంతత కోసం:  తెల్లటి రంగు వినాయకుడిని పూజించడం వలన ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది.  ఇంట్లో గొడవలు తొలగి.. కుటుంబసభ్యులందరూ కలసి ఉంటారట. అన్నదమ్ములు.. అక్క చెల్లెళ్ల మధ్య గొడవలున్నవారు తెలుపు రంగు వినాయకుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు. 

దుష్ట శక్తుల పరిహారం:  చాలామంది దుష్టశక్తుల వలన ఇబ్బందులు పడతారు.  అనేకమంది యంత్రాలు.. తాయిత్తులు కట్టుకున్నా అలానే ఉంటారు.  అలా ఇబ్బంది పడే వారు  రావి ఆకు రూపంలో ఉన్న వినాయకుడిని పూజిస్తే అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు. 

వెండి వినాయకుడు:  చాలామంది ఎంత ఉన్నత స్థితిలో  ఉన్నా.. అందరికి సాయం చేసినా కాని కొంతమందికి సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు ఉండవు.  తరచే అవమానపడతారు.  ఇలాంటి వారు వెండి వినాయకుడి పూజిస్తే అలాంటి సమస్యలు తొలగుతాయి. 

ఆరోగ్యం కోసం : చెక్కతో తయారు చేసిన వినాయకుడిని పూజించాలి. 

సంతోషం.. సౌభాగ్యం కోసం:  కంచువినాయకుడిని పూజించాలి. 

కెరీర్​.. మంచి జాబ్​ కోసం:  మట్టి గణపతిని పూజించాలి.