ఆధ్యాత్మికం: దేవుడి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి.. శ్రీకృష్ణుడు చెప్పినది ఇదే..!

ఆధ్యాత్మికం:  దేవుడి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి..  శ్రీకృష్ణుడు చెప్పినది ఇదే..!

ప్రపంచంలో మనుషులంతా ఒకే విధంగా ఉండరు. కొందరు వారి జీవితంలో విజయవంతంగా ముందుకు సాగిపోతుంటారు. మరికొందరేమో అనుకున్న పనులు సమయానికి జరగక, ఎప్పుడూ అడ్డంకులే ఎదురవుతుంటాయి. చుట్టూ ఉన్న మనుషులంతా వారిని "మీకు దేవుడు అనుగ్రహం లేదేమో.. ఇలా చేయండా.. అలా చేయండి.. కొన్ని దేవుళ్లపేర్లు చెప్పి పూజలుచేయమంటారు.  నిజంగా దేవుడి అనుగ్రహం పొందాలంటే  ఏమి చేయాలి..గీతలో శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడు.. భగవంతుని అనుగ్రహం పొందాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము.

మన వద్ద ధన కనక వస్తువాహనాలు ఎన్నైనా ఉండవచ్చును, కానీ అవేవీ మనల్ని రక్షించలేవు,ఒక్క ఆత్మ విశ్వాసమే మనకు రక్ష, మనమీ జగత్తులో ఏపని చేసినప్పటికీ, మన దృష్టిని మాత్రం, ఆత్మ పై పెట్టుకోవాలి. దానిని మనము మరువ కూడదు.

  • "నేనెప్పుడూ, భగవచ్చింతన చేస్తూ ఉంటే యుద్దమెట్లా చేసేది...? అని అర్జునుడు శ్రీ కృష్ణుని ప్రశ్నించాడు. కృష్ణుడు, "ఓ పిచ్చివాడా! యుద్ధము చేసేది, నీ దేహమే కాని... నీ మనస్సు కాదుకదా! కాబట్టి నీ మనస్సును భగవంతుని పై పెట్టు అన్నాడు కృష్ణుడు... చాలమంది..  "కృష్ణుడు, శిశుపాలుని చక్రంతో ఖండించాడని అంటారు.  కానీ... పళ్ళెరమే, శిశుపాలుని గొంతుకోసింది.  చెడ్డ కాలం వస్తే... తాడే  పామైకరుస్తుంది...
  • మంచి కాలం రావాలంటే హృదయంలో మంచి భావాలను ప్రతిష్ఠ చేసుకోవాలి.  నోటితో ఎప్పుడూ మంచి మాటలు మాట్లాడాలి.  ఎవరిని అనవసరంగా నిందించకూడదు. మనం జగత్తునంతా  చూస్తూనే ఉన్నాము.  దైవ సన్నిధికి పోతుంటాం.  చాలామంది దేవుడి దగ్గర  కనులు మూసుకుంటారు.  అలా యాదృచ్చికంగా జరిగిపోతుంది.  
  • ఇంద్రియాలను పవిత్ర మార్గంలో, వినియోగించినపుడు  మనము అడుగ కుండానే భగవంతుడు మనకు కావలసినవి అనుగ్రహిస్తాడు...
  • కోపం వస్తే మౌనం వహించాలి... నోరుంది కదా అని... ఇష్టం వచ్చినట్లు మాట్లాడ కూడదు. 
  • ఎంత తక్కువగా మాట్లాడితే హృదయం, అంత పవిత్రంగా ఉంటుంది. 
  • ప్రస్తుత సమాజంలోని జనాలు ..  ఇంద్రియాలను వారి ఇష్టానుసారం వదిలి పెట్టారు. కనుకనే పడరాని పాట్లు పడుతున్నాము..మితంగా భుజించాలి. ఎల్లప్పుడు భగవన్నామస్మరణ చేస్తూనే ఉండాలి. అందరూ నావారే అనే విశాలమైన భావం పెంచుకోవాలి.
  • "అహం బ్రాహ్మాస్మి , సర్వం కల్విదం బ్రహ్మ" అనే భావంతో మెలగాలి.. ఎల్లప్పుడు సాధ్యమైనంత వరకు హరినామ సంకీర్తనతో గడపాలి.  ( ఉదాహరణకు.. ప్రయాణించేటప్పుడు.. ఖాళీగా కూర్చున్నప్పుడు... మార్నింగ్ వాకింగ్​.. ఈవెనింగ్​ వాకింగ్​​ సమయంలో కూడా భగవంతుడిని ధ్యానించుకోవచ్చు)
  • అప్పుడే మనకు భగ్వదనుగ్రహం దొరుకుతుంది

మనకు నిత్యజీవితంలో  దోషాలు, పాపాలు, తప్పులు ఎలాగూ అంటుకుంటాయి. నేను పాపం చేయలేదు ...  ఎదుటివాడు పాపం చేశాడంటే వాడు పాపం చేస్తున్నది నీవు చూస్తున్నావు కదా..!  ఆ పాప ఫలితంలో నీకు కూడా సగభాగం ఉంటుంది. కనుకనే ఈ వేదాంతమునందు  సూక్ష్మ మైనది .. జ్ఞానం అంతటా ఉంటుందని శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. 
 
మహా నిండు సభ లోపల దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవం చేశాడు.  అప్పుడు  అక్కడ ఉన్న పితామహులను అందరినీ ప్రార్ధించింది. అక్కడ భీష్ముడున్నాడు, ధ్రోణాచార్యుడున్నాడు, కృపాచార్యుడున్నాడు ఇంకా ఎందరో మహామహులందరూ కూడా ఉన్నారు.  కానీ ఒక్కరైనా వచ్చి ఎదురు చెప్పలేదు.. దుర్యోధనుడు చేస్తున్నది పాపమని చెప్పలేదు. కనుకనే కృష్ణుడు తరువాత చెప్పాడు.

భీష్మా! నీవు మహా జ్జ్ఞాని గా ఉంటున్నావు... ధ్రోణాచార్య! నీవు మహాచార్యుడుగా ఉంటున్నావు.
మీరు కురు వంశానికి   ఆధ్యాత్మికంగా ఉంటున్నటువంటి వారు .. అధ్యాత్మికులే కాదు, గురు సమానులు .. ఆచార్యులు కూడా..

గురువు అంటే శిష్యులకు విషయాలను బోధించేవాడు.  ఆచార్యులంటే .. ఆచరించి నిరూపించినట్టివాడు ఆచార్యుడు, ఆచార్యులైన మీరు నోరెత్తడం లేదు..  కనుక ధుర్యోధనుడు చేసిన పాపం..ఆయనకు మాత్రమే రావడం కాదు... ఈ పాపాన్ని చూచిన మీకు పాపమే. ఇది తప్పని తెలిసి కూడా చెప్పకుండా ఉన్న మీరు కూడా పాపాత్ములే.  దుర్యోధనుడు  చేసినటువంటి పరమ హింసలు మీరు  చూస్తున్నారు... తప్పని చెప్పడం లేదు..  కాబట్టి  మీరు కూడా పాపాత్ముల జాబితాలో చేరుతారు   అని శ్రీకృష్ణుడు చెప్పాడు.

భీష్మాచార్య...  మీరు జ్జ్ఞానం తెలిసి వారు  ఏమి జవాబు చెప్పకుండా ఉన్నారు. మీకు కూడాను పాపమే. చేసిన వాడు, చూసిన వాడు, పురి కొల్పిన వాడు అనుభవింపచేసేటటువంటి వాడు... ఈ నలుగురు కూడాను పాపులే అని చెప్పాడు. 

 

  • ఎవరో తప్పు చేస్తుంటే వాడికి మాత్రమే కాదు ఈ దోషము...
  • తప్పని చెప్పకుండా ఉండేవారిది కూడాను దోషమే... 
  • ఈ తప్పును చూస్తున్నటువంటి వాడిది కూడాను దోషమే...
  • ఈ తప్పును పురికొల్పిన వాడిది కూడాను దోషమే..
  • అంటూ శ్రీకృష్ణుడు కౌరవ సమూహాన్ని హెచ్చరించాడు.

అందుకే కౌరవులకు దేవుడి..భగవంతుడి అనుగ్రహం లేకుండా పోయింది.  పాపము చేసిన వారికి అన్ని తెలిసిన మహామహులు చెప్పకపోవడం వలన వారికి కూడా పాపం అంటుకుంది. అందుకే చివరి క్షణంలో  వారు భగవాదనుగ్రహం పొందలేకపోయారని శ్రీకృష్ణుడు చెప్పాడు.  పాండవులు.. ఐదుగురు మాత్రమే.. విధి వక్రీకరించి జూదంలో ఓడిపోయారు.. కాని వారు ఏనాడు ఎవరికి ఏ విధమైన హాని తలపెట్టలేదు.  ఎలాంటి పాపం పనులను కూడా ప్రోత్సహించలేదు.  ఎప్పుడూ భగవంతునిని ధ్యానించే వారు.  అందుకే వారు వనవాసము..అఙ్ఞాత వాసాన్ని దేవుని అనుగ్రహంతో పూర్తిచేశారు.