పిల్లలు రాత్రిళ్లు నిద్రపోకపోతే ఏం చేయాలంటే

పిల్లలు రాత్రిళ్లు నిద్రపోకపోతే ఏం చేయాలంటే

పిల్లలు రాత్రిళ్లు నిద్రపోకపోతే చాలామంది పేరెంట్స్ ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య ఎక్కువగా ఐదేళ్ల నుంచి పదేళ్ల లోపు పిల్లల్లో కనిపిస్తుంది. అయితే, కొన్ని రెమెడీస్ ఫాలో అయితే పిల్లలు హాయిగా నిద్రపోతారు. పిల్లలను ఎట్టిపరిస్థితుల్లోనూ పగలు నిద్రపోకుండా చూడాలి. ఒకవేళ పగలు పడుకుంటుంటే రెగ్యులర్గా ఏ టైంలో వాళ్లు పడుకుంటున్నారో చూసి, ఆ టైంలో వాళ్లను డైవర్ట్ చేయాలి. వాళ్లకు ఇష్టమైన పనులు అప్పగించాలి.
ప్రతిరోజూ రాత్రి పడుకునే రెండు గంటల ముందు పిల్లలు ఫుడ్ తినేలా చూడాలి. 
పడుకునేముందు వేడి వేడి పాలు తాగినా హాయిగా నిద్రపడుతుంది. 
పాలలో పసుపు లేదా ఇలాచి పొడి వేస్తే ఇంకా మంచిది. 
పడుకునేముందు పాదాలకు మర్దనా చేసినా, తలకు మసాజ్ చేసినా పిల్లలు రిలాక్స్ అవుతారు. 
దీనివల్ల తొందరగా నిద్రలోకి వెళ్లే ఛాన్స్ ఉంది. 
డీప్ ఫ్రైలు పిల్లలకు పెట్టకూడదు. ఇవి వాళ్ల మూడ్ని మారుస్తాయి.
పిల్లలు నిద్రపోయే గదిలో మంచి వాసన ఉండే రూమ్ ఫ్రెష్నర్స్ ఉంచాలి. 
రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించాలి. అప్పుడే పిల్లలు హాయిగా నిద్రపోతారు.