సాహూలో ఉన్నాడు అది పోయింది.. మరి సలార్?

సాహూలో ఉన్నాడు అది పోయింది.. మరి సలార్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న సినిమా సలార్. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండి.. ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దానికి కారణం.. కేజీఎఫ్(KGF) డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) ఈ సినిమాకు దర్శకతం వహిస్తుండటమే. బాహుబలి(Bahubali) తరువాత ప్రభాస్ కు ఆ రేంజ్ సినిమా గానీ, ఆ రేంజ్ డైరెక్టర్ గానీ పడలేదు. అందుకే.. కేజీఎఫ్ తో ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. 

ఇక తాజాగా సలార్ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ కు ప్రభాస్ ఫ్యాన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో.. సలార్ టీజర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది. అంతా సెట్టు.. సలార్ పక్కా పాన్ ఇండియా రేంజ్ లో ప్రీవియస్ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమని అనుకున్నారు ఫ్యాన్స్.

Also Read :-ఎంజాయ్ : OTTలోకి రెండు కొత్త సినిమాలు

అయితే తాజాగా సలార్ లోని ఒక ఎలిమెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ కు కుదురులేకుండా చేస్తోంది. అదేంటంటే.. సలార్ టీజర్ స్టార్టింగ్ లో బాలీవుడ్ నటుడు టిన్ను ఆనంద్(Tinnu Anand) చెప్పిన డైలాగ్ టీజర్ కే హైలెట్ గా నిలిచింది. ఈ నటుడు ప్రభాస్ హీరోగా చేసిన సాహూ(Sahoo) సినిమాలో కూడా నడిచారు. ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. అంతేకాదు.. చిరంజీవి(Chirajneevi) హీరోగా వచ్చిన అంజి(Anji) సినిమాలో కూడా నటించారు టిన్ను ఆనంద్. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది.

దీంతో.. సలార్ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి సలార్ మూవీతో ప్రభాస్.. టిన్ను ఆనంద్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారా అనేది చూడాలి.