వ్యాక్సిన్ వేసుకున్నాక జ్వరం ఎందుకు వస్తది?

వ్యాక్సిన్ వేసుకున్నాక జ్వరం ఎందుకు వస్తది?
  • ఒళ్ల నొప్పులు.. ఆయాసం.. తల నొప్పి వచ్చిందా..?
  • ఇలా ఎందుకు జరుగుతుందంటే..?

వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాక కొంత మందికి జ్వరం వస్తుంటే.. మరికొంత మందికి ఒళ్ల నొప్పులు.. లేదా ఆయాసం.. లేదా తీవ్రమైన తలనొప్పి.. ఆయాసం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. మరికొంత మందిలో ఇవేవీ కనిపించలేదని చెబుతుంటారు. వ్యాక్సిన్ వేసుకున్నాక ఏదైనా అనారోగ్యం వస్తే లేదా ఏమీ రాకుండా సాధారణంగా ఉండిపోవడంపై ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణులు నిరంతరం అధ్యయనం చేస్తున్నారు.  కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న విషయం తెలిసిందే. భౌగోళికంగా ఆయా దేశాల్లో తీవ్రమైన చలి (మంచు కురిసే ప్రాంతాలు),తీవ్రమైన  ఎండ (ఎడారి), సముద్ర తీర ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాల్లో ఆయా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పరిస్థితిని బట్టి వ్యాక్సిన శరీరంలో ఎలా పనిచేస్తున్నదో తెలుసుకుంటున్నారు. వ్యాక్సిన్ మార్కెట్లోకి రిలీజ్ కంటే ముందే క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినా.. చాలా తక్కువ సంఖ్యలోనే జరిగాయి. తాజాగా ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ కోట్లకు చేరుకున్న నేపధ్యంలో వైద్య నిపుణులు కచ్చితమైన సమాచారం కోసం అధ్యయనం కొనసాగిస్తున్నారు. ఆయా దేశాల్లో పరిస్థితుల ఆధారంగా శరీరంలోవ్యాక్సిన్ తెచ్చే మార్పులను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు.
వ్యాక్సిన్ వేసుకున్నాక శరీరంలో ఏం జరుగుతుందంటే..?
కరోనా వ్యాక్సన్ వేసుకున్నాక మనిషి శరీరంలో దాని ప్రభావం ఎంత మేరకు ఉందనేది తెలుసుకునేందుకు అధ్యయనాలు జరుగుతున్నాయి. శరీరం రోగ నిరోధక వ్యవస్థ రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒకటి సహజసిద్ధంగా స్పందించేది.. రెండోది మందులు, టీకాలు తదితర వాటి ఉత్ప్రేరకంతో పనిచేసేవి. అందుకే వ్యాక్సిన్ వేసుకున్నాక తెల్ల రక్త కణాలు వ్యాక్సిన్ తో కలసిపోయి ప్రక్రియను చేపడతాయి. దీని వల్ల వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఒళ్ల నొప్పులు, జ్వరం.. అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ ప్రక్రియ వయసును బట్టి క్షీణిస్తుంది. యువత చాలా దృఢంగా ఉంటారు కాబట్టి ప్రక్రియ వేగంగా జరిగిపోతుంది. అలాగే వృద్ధుల్లో యువతకు భిన్నంగా నిదానంగా పనిచేస్తుంది కాబట్టి వీరికి లక్షణాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. వీరికే వ్యాక్సిన్ ఉత్తేజం అవసరం అవుతుంది. యాంటీ బాడీలను ఉత్పత్తి చేసేందుకే వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మహిళలు వ్యాక్సిన్ వేసుకున్నాక గడ్డలు కట్టిందని చెబుతుంటారు. అవి క్యాన్సర్ గడ్డలేమోనని అనుమానిస్తుంటారు. ఇలాంటి అనుమానాలు తలెత్తకూడదంటే మహిలలు రొమ్ము క్యాన్సర్ నిర్దారణకు మామో గ్రామ్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. తాజా అధ్యయనాల ప్రకారం జ్వరం.. తలనొప్పి.. ఒళ్ల నొప్పులు రావడం సాధారణమే అని.. శరీర దృఢత్వాన్ని బట్టి ఇవి రెండు మూడ్రోజులు లేదా 15 రోజుల వరకు ఉండే ఛాన్స్ ఉందని తేలింది. ఇంతకు మించి ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించి జబ్బులను నిర్ధారించుకుని తగిన చికిత్స చేయించుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ అపోహలకు దూరంగా అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే ఇమ్యూనిటీ స్థాయి తెలిసిపోతుందని.. తక్కువగా ఉంటే వెంటనే పెంచుకోవాల్సిన అవసరం సూచిస్తుందని చెబుతున్నారు.