
ముషీరాబాద్, వెలుగు: ఉస్మానియా ఆసుపత్రిలో కొనసాగుతున్న అశోక్ ఆమరణ నిరాహార దీక్షపై ఎంపీ ఆర్.కృష్ణయ్య స్పందించారు. ఆయనకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. అశోక్ దీక్షకు మద్దతు తెలపాలని కోరుతూ గురువారం విద్యానగర్ బీసీ భవన్లో ఆర్.కృష్ణయ్యను నిరుద్యోగులతో కలిసి అశోక్ భార్య సునీత కలిశారు.
ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్యపై అశోక్ 12 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారన్నారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతిలాల్, గ్రూప్ 1 ఆస్పరెంట్ ఝాన్సీ రాణి, నీల వెంకటేశ్, రవికుమార్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.