ఏ స్థాయికి ఏదిగినా ఒదిగి ఉండడం పీవీకే సొంతం : మంత్రి తలసాని

ఏ స్థాయికి ఏదిగినా ఒదిగి ఉండడం పీవీకే సొంతం : మంత్రి తలసాని

భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు రావు 18 వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ లో ఆయన సమాధికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు వాణి దేవి, బుగ్గారపు దయానంద్, ప్రభుత్వ సలహాదారులు రమణ చారి పాల్గొన్నారు. 

 దేశానికి చేసిన సేవను గుర్తించి భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావుకు భారతరత్న ఇవ్వాలని మంత్రి తలసాని కోరారు. మాజీ ప్రధాని.. తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నర్సింహా రావు18 వ వర్ధంతికి రాష్ట్ర ప్రభుత్వం  ఘనమైన నివాళులు అర్పిస్తుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా వర్థంతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయన్న మంత్రి తలసాని... జననం, మరణం సాధారణమన్నారు. కానీ కొందరు మాత్రమే చరిత్రలో మిగిలిపోతారని కొనియాడారు. అందులో పీవీ గారు మొదటి స్థానంలో ఉంటారని చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో పుట్టి  రైతు బిడ్డగా అంచలంచెలుగా ఎదిగారన్నారు. 

ఏ స్థాయికి ఏదిగినా ఒదిగి ఉండడం ఆయనకే సొంతమని పీవీ సేవలను స్మరించుకున్నారు. దేశ ప్రధానిగా ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారని, పీవీ కృషితో దేశం పురోగతి చెంది ముందుకు వెళ్తోందని చెప్పారు. పీవీ బహు భాషాశాలి అని... కేసిఆర్ నాయకత్వంలో ఆయనను గౌరవించుకోవాలని శత జయంతి ఉత్సవాలు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వచ్చే జనరేషన్ కి ఆయన గురించి తెలియాల్సిన అవసరం ఉందని తెలిపారు.