వాట్సప్​లో చాట్​ చేయాలా.. ఇకపై ఫోన్ అక్కర్లేదు.. నిజమండీ.. ఈ వార్త చదవండీ..

వాట్సప్​లో చాట్​ చేయాలా..  ఇకపై ఫోన్ అక్కర్లేదు.. నిజమండీ.. ఈ వార్త చదవండీ..

వాట్సప్.. సోషల్​ మీడియాలో దీని ప్రత్యేకతే వేరు. ఇది అందుబాటులోకి వచ్చిన తరువాత మెసేజింగ్​ల స్పీడు బాగా పెరిగింది. ఇప్పటి వరకు కేవలం ఫోన్లు, ల్యాప్ టాప్​లు, కంప్యూటర్లలోనే అందుబాటులో ఉన్న ఈ వాట్సప్​ఇకపై స్మార్ట్​వాచీలల్లోను అలరించనుంది. నిజమండీ.. ఈ వార్త వాట్సప్ స్వయంగా ప్రకటించింది. 

ఫోన్​లో చాట్​చేసినట్టుగానే ఇకపై స్మార్ట్ వాచ్​నుంచి కూడా వాట్సప్ మెసేజ్​లకు రిప్లై ఇవ్వొచ్చని తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్​ ఆండ్రాయిడ్​ మొబైల్​ఫోన్​ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. గూగుల్​ వాచ్​ ఆపరేటింగ్​ సిస్టమ్​ వేర్​ ఓఎస్​3 తో పని చేస్తున్న అన్ని రకాల స్మార్ట్​వాచ్​లలో వాట్సప్​ సేవలు వినియోగించుకోవచ్చని ప్రకటించింది. 

ఇకపై స్మార్ట్​వాచ్​ల్లో వాట్సప్​తో నేరుగా కాల్​ చేసుకోవచ్చు. ఏమోజీలు, చాట్​, రిప్లై ఇలా ఫోన్​లో ఏవైతే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయో అన్ని చేసుకోవచ్చు. ఈ స్మార్ట్​కహానీ ఇకపై మెటా సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించేందుకు ఉపయోగపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.