వాట్సాప్ కొత్త సెర్చ్ ఆప్షన్ : ఓపెన్ స్క్రీన్ పైనే కాల్, చాట్ బటన్స్

వాట్సాప్ కొత్త సెర్చ్ ఆప్షన్ : ఓపెన్ స్క్రీన్ పైనే కాల్, చాట్ బటన్స్

ఇన్స్టంట్ మేసేజింగ్ అప్లికేషన్ WhatsApp అప్ డేట్ ట్యాబ్లో కొత్త సెర్చ్  ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. స్టేటస్ అప్డేట్లు, ఛానెల్ కోసం సెర్చింగ్ సులభతరం చేసేందుకు కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. వినయోగదారులకు ఛానెల్ సెర్చ్ మరింత సులభతరం చేస్తుంది ఈ ఫీచర్. అంతేకాదు ఏదైతే ఛానల్ ను యూజర్ అనుసరించకూడదు అనుకుంటున్నాడో.. ఆ ఛానెల్స్ కుదించే అవకాశం కూడా ఈ ఫీచర్ కల్పిస్తోంది. 

ఆండ్రాయిడ్ 2.23.21.7 అప్ డేట్ కోసం ఈ ఫీచర్ ఇప్పటికే కొంతమంది ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు విడుదల చేశారు. iOS లో యాప్ లో కూడా వాట్సప్ సెర్చ్ ఫీచర్ రోల్ చేస్తుంది. అప్ డేట్ ట్యాబ్ కోసం బీటా టెస్టర్లకు కొత్త సెర్చింగ్ బార్ అందుబాటులో ఉన్నాయి. iOS 23.21.1.72 అప్ డేట్ కోసం టెస్ట్ ఫ్లైట్ యాప్ నుంచి  కొత్త వాట్సప్ బేటా అందుబాటులో ఉంది. 

iOS లో Test Flight యాప్ ద్వారా Whats App బీటా అప్ డేట్ లను ఇన్ స్టాల్ చేసుకున్న వారికి ఆప్డేట్ ట్యాబ్లో బీటా టెస్టర్లను ఎంచుకోవడానికి ఈ కొత్త సెర్చ్ ఫీచర్ ఉపయోగపడుతుంది. రానున్న రోజుల్లో మరింత మందికి ఇది అందుబాటులోకి రానుంది.