యూజర్లను బలవంత పెట్టం.. కోర్టుకు తెలిపిన వాట్సాప్

యూజర్లను బలవంత పెట్టం.. కోర్టుకు తెలిపిన వాట్సాప్

న్యూఢిల్లీ: వాట్సాప్ తన కొత్త ప్రైవసీ పాలసీ విషయంలో వెనక్కి తగ్గింది. ప్రైవసీ పాలసీని అంగీకరించాలని ఇకపై యూజర్లపై ఒత్తిడి తీసుకురాబోమని ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ స్పష్టం చేసింది. సమాచార భద్రతా బిల్లు (డేటా ప్రొటెక్షన్ బిల్లు) అమల్లోకి వచ్చేంత వరకు ప్రైవేట్ పాలసీ విధానంపై యూజర్లను బలవంత పెట్టబోమని స్వచ్ఛందంగా పేర్కొంది. అదే సమయంలో వినియోగదారులకు ఎలాంటి సేవలు ఆపబోమని కోర్టుకు తెలిపింది. ఏదేమైనా అప్‌డేట్ చేసుకోవాలనే మెసేజ్‌ను మాత్రం డిస్‌ప్లే చేస్తామని వివరణ ఇచ్చింది. కాగా, గతంలో తమ ప్రైవసీ పాలసీని యూజర్లు అంగీకరించకపోతే సేవలు నిలిపివేస్తామని వాట్సాప్ తెలిపిన సంగతి తెలిసిందే.