
హైదరాబాద్ సిటీ ఫొటోగ్రాఫర్: నిమ్స్ దవాఖానలో రోగుల కోసం వాడాల్సిన వీల్చైర్లు, స్ట్రెచర్లు మిస్ యూజ్ అవుతున్నాయి. నడవలేని పరిస్థితిలో ఉన్న రోగులు, వృద్ధుల కోసం వాడాల్సి ఉండగా సిబ్బంది నిరాకరిస్తున్నారు.
మరోవైపు వివిధ రకాల వస్తువులను ఒక బ్లాక్ నుంచి మరో బ్లాక్‌కు తీసుకెళ్లే క్రమంలో వాటిని వాడుతున్నారు. దీంతో ఒంట్లో సత్తువ లేని పేషెంట్లు, వృద్ధులు ఇలా కాలినడకన ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారు.