మన్మోహన్ ప్లేస్‌‌లో చాయ్‌‌వాలా ప్రధాని.. అందుకే రేట్లు పెరుగుతున్నయ్

మన్మోహన్ ప్లేస్‌‌లో చాయ్‌‌వాలా ప్రధాని.. అందుకే రేట్లు పెరుగుతున్నయ్

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్థానంలో నరేంద్ర మోడీ పీఎం అయినందుకే రేట్లు పెరుగుతున్నయ్ అని కాంగ్రెస్ ఎంపీ రవ్‌‌నీత్ సింగ్ బిట్టూ విమర్శించారు. చమురు ధరల రేట్లు రోజురోజుకీ పెరుగుతుండటంపై రవ్‌‌నీత్ ఫైర్ అయ్యారు. మన్మోహన్ ప్లేస్‌‌లో ఓ చాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధానిగా ఎన్నికైనందున.. 2024 వరకు ప్రజలకు ఈ ఇబ్బందులు తప్పవని బిట్టూ స్పష్టం చేశారు.

పెట్రో ధరల తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మీటింగ్‌‌లో పెట్రో ధరల భారాన్ని తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్ మీద సుంకాలను తగ్గిద్దామని నిర్మల ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌‌గా చేసుకుంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలకు దిగుతున్నారు. మోడీ తన బిలియనీర్ మిత్రుల కోసం ఎకానమీలోని రెండు ఎండ్‌‌ల నుంచి బ్యాటింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ వాద్రా వ్యంగ్యంగా కామెంట్ చేశారు.