Coolie OTT: నెల రోజుల్లోపే ఓటీటీలోకి రజనీకాంత్ ‘కూలీ’.. స్ట్రీమింగ్ డేట్పై కొత్త అప్డేట్!

Coolie OTT: నెల రోజుల్లోపే ఓటీటీలోకి రజనీకాంత్  ‘కూలీ’.. స్ట్రీమింగ్ డేట్పై కొత్త అప్డేట్!

రజనీకాంత్-నాగార్జున నటించిన రీసెంట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘కూలీ’. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ మూవీ ఆగస్టు 14న విడుదలై మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ పలు రికార్డులను నెలకొల్పి రూ.500 కోట్ల క్లబ్లో చేరింది. ఇపుడు ఈ మూవీ థియేటర్ లాంగ్ రన్ కంప్లీట్ చేసుకుని త్వరలో ఓటీటీలోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. 

‘కూలీ’ ఓటీటీ:

‘కూలీ’ ఓటీటీ హక్కులను ప్రైమ్ వీడియో దక్కించుకున్న విషయం తెలిసిందే. దాదాపు రూ.120 కోట్లు పెట్టి ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే, ప్రైమ్ వీడియో, కూలీ మేకర్స్తో మాట్లాడుకున్న డేట్కి ముందే  స్ట్రీమింగ్కి తీసుకొచ్చేలా ప్రయత్నం జరుగుతుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 11 నుంచి కూలీ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది. త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

‘కూలీ’ బాక్సాఫీస్:

ఆగస్టు 14న విడుదలైన ‘కూలీ’ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే సాధించింది. విడుదలైన 19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.507 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇండియాలో రూ.281 కోట్ల నెట్ వసూలు చేసింది.

ALSO READ :‘నెట్‌ఫ్లిక్స్’లోకి కొత్త క్రైమ్ థ్రిల్లర్ వచ్చేస్తుంది.. ఇరవైకి పైగా హత్యలు చేసిన కిల్లర్.. స్ట్రీమింగ్ వివరాలివే

ఇక రాష్ట్రాల వారీగా వసూళ్లు చూస్తే.. సొంత భాష తమిళంలోనే అత్యధికంగా రూ.180 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత తెలుగులో రూ.60 కోట్లు చేయగా, హిందీలో రూ.36 కోట్లు, కన్నడలో రూ.2.92 కోట్ల వసూళ్ళు సాధించింది. ఇకపోతే 20వ రోజైన నిన్న మంగళవారం సైతం ఇండియాలో రూ.1.3 కోట్ల నెట్ సాధించింది. 

తలైవా రూ.500 కోట్ల క్లబ్:

రజనీకాంత్ ఖాతాలో రూ.500 కోట్లు సాధించిన చిత్రాల్లో కూలీ మూడవ చిత్రంగా నిలిచింది. గతంలో రోబో 2.0, జైలర్ సినిమాలు ఈ ఫీట్ సాధించాయి. ఈ క్రమంలో రజినీ ఖాతాలో మూడు 500 కోట్ల మార్క్ సినిమాలను సాధించి తలైవా తన పవర్ చూపించారు. అంతేకాకుండా.. మూడు 500 కోట్ల సినిమాలను అందించిన ఏకైక తమిళ హీరోగా రజినీకాంత్ నిలిచారు.