ఆ దేశాల్లో ఏప్రిల్ 10నే ఈద్.. ఇండియాలో ఎప్పుడంటే?

ఆ దేశాల్లో ఏప్రిల్ 10నే ఈద్..  ఇండియాలో ఎప్పుడంటే?

ఈద్ అల్-ఫితర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ముఖ్యమైన పండగ. పవిత్ర పండగగా భావించే రంజాన్ మాసం సందర్భంగా భారత్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా ముస్లీంలు నెల రోజులపాటుగా ఉపవాస దీక్షలు చేస్తున్నారు.  ఈ ఉపవాస దీక్ష ముగింపును ఈద్ అల్-ఫితర్ సూచిస్తుంది. ఈరోజుతో ముస్లింలు కొనసాగించిన ఉపవాసాలు విరమిస్తారు.  ఇస్లామిక్ క్యాలెండర్ హిజ్రీ ప్రకారం.. ఈ వేడుకతో ఇస్లామిక్ క్యాలెండర్‌లోని పదవ నెల షవ్వాల్ ప్రారంభం అవుతుంది.  ఈ షవ్వాల్ మొదటి రోజున ఈద్ అల్-ఫితర్ పండగను ముస్లీంలు ఘనంగా జరుపుకుంటారు.

అయితే ఇది నెలవంక దర్శనంతో ముడిపడి ఉంటుంది. నెలవంక కనిపిస్తే పండగ సందడి ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజే పండగను వైభవంగా జరుపుకుంటారు. అయితే, ఈ ఏడాది( 2024) ఏప్రిల్ 8వ తేదీ సోమవారం షెడ్యూల్ ప్రకారం సౌదీ అరేబియాలో  నెలవంక కనిపించలేదు. దీంతో సౌదీ అరేబియా, UAE, దుబాయ్, ఖతార్‌ వంటి ముస్లీం దేశాలల్లో ఏప్రిల్ 10వ తేదీ బుధవారం ఈద్ అల్ ఫితర్ జరుపుకోనున్నారు.  

అయితే, భారత్ లో మాత్రం ఆ మరుసటి రోజున ఈద్ అల్ ఫితర్ జరుపుకునే అవకాశం ఉంది.  భారత్ లో నెలవంక ఏప్రిల్ 10న కనిపించనుంది. దీంతో ఏప్రిల్ 11న దేశంలోని ముస్లీంలు అందరూ ఈ పండగ జరుపుకోనున్నారు.