సర్కార్ చెప్పిన సగం బెడ్లు ఎక్కడ ?

సర్కార్ చెప్పిన సగం బెడ్లు ఎక్కడ ?

కార్పొరేట్ హాస్పి టల్లలో పేదలకు అందని కరోనా ట్రీట్ మెంట్

ఫిఫ్టీ ఫిఫ్టీ బెడ్ల ఫార్మూలా పత్తా లేదు..

ఫీజుల జీవో జాడ లేదు

ఏ ఒక్క హాస్పిటల్ లోనూ కనిపించని చార్జీల బోర్డులు

సగం మందికైనా రీజనబుల్ ఫీజులు అమలు చేయాలని సర్కారు బేరాలు

కుదరదంటున్న కార్పొరేట్ మేనేజ్ మెంట్లు ..

చర్చల పేరిట టైమ్ పాస్

రెండు హాస్పిటల్ల పై చర్యలు తీసుకొని చేతులెత్తేసిన ప్రభుత్వం

కార్పొరేట్‌ హాస్పిటళ్లు రాష్ట్ర సర్కార్‌‌‌‌ను ఖాతరు చేయడం లేదు. ఒక్క ఆర్డర్‌‌‌‌ను కూడా పట్టించుకోవడం లేదు. కరోనా ట్రీట్‌ మెంట్ ప్యాకే జీల జీవోను అసలే లెక్క చేయకపోగా.. ఇప్పుడు సగం బెడ్ల ఫార్ములాకు కూడా ఒప్పుకుంటలేవు. తొలుత ఒప్పుకున్నట్టే ఒప్పుకొని.. ఇప్పుడు కుదరదు పో… అంటున్నాయి. చర్చల పేరిట సాగదిస్తూ దోపిడీని కొనసాగిస్తున్నా యి. కఠిన చర్యలు తీసుకుంటామని, సగం బెడ్లు స్వాధీనం చేసుకుంటామని ప్రకటనలు చేసిన మంత్రి ఈటల కూడా సైలెంట్ అయిపోయారు. సర్కార్ పెద్దలే చప్పుడు చేయకపోవడంతో ఆఫీసర్లు కూడా ప్రైవేట్ హాస్పి టల్స్ జోలికి వెళ్లడం లేదు. వేల సంఖ్యలో కంప్లయింట్లు వస్తున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నా రు. నడిమిట్ల జనం నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఇటు ప్రభుత్వ దవాఖాన్లకు పోలేక.. అటు ప్రైవేట్‌ లో బిల్లులు కట్టలేక ఆగమవుతున్నారు.

హైదరాబాద్, వెలుగు: తమ ఆర్డర్స్​ను అమలు చేయని ప్రైవేటు హాస్పిటల్స్​పై కఠిన చర్యలు తీసుకుంటామని పదే పదే హెచ్చరించి న రాష్ట్ర ప్రభుత్వం .. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రైవేట్‌‌ హాస్పిటళ్ల దోపిడీపై హెల్త్​ డిపార్ట్ మెంట్ కు ఇప్పటికే 1,200లకుపైగా ఫిర్యాదులు వచ్చాయి. దాదాపు హైదరాబాద్‌ లోని అన్ని ప్రైవేటు హాస్పిటళ్లపై కంప్లయింట్లు వచ్చాయని, అందరికీ నోటీసులు ఇచ్చామని ఈ నెల 10న మంత్రి ఈటల వెల్లడించారు. దోపిడీ ఇట్లనే కొనసాగితే ప్రైవేటు హాస్పి టళ్లలో సగం బెడ్లను స్వాధీనం చేసుకుంటా మని హెచ్చరించారు. కానీ ఇప్పటికీ ఒక్క హాస్పి టల్ నూ ఏమీ చేయలేకపోయారు. దీంతో ప్రైవేట్ హాస్పి టల్స్ కరోనా పేషెంట్ల నుంచి లక్షలకు లక్షలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నాయి. సగం బెడ్ల ఫార్ములా పై సాగదీస్తున్నాయి. రాష్ట్ర సర్కారు పట్టిం చుకోకపోవడంతో బాధితులు కేంద్ర సంస్థలకు ఫిర్యా దు చేస్తున్నారు . ఎక్కువ చార్జీలపై కేర్‌‌, మెడికవర్‌‌, యశోద ఆస్పత్రులకు నేషనల్ ఫార్మాస్యూటి కల్‌ ప్రైసింగ్‌ అథారిటీ నోటీసులు ఇచ్చింది.

జీవోను లెక్క చేయలె

కరోనా పేషెంట్ల వద్ద ప్రైవేట్ హాస్పిటళ్లు అడ్డగోలుగా బిల్లులు వసూలు చేస్తుండటంతో ట్రీట్‌‌‌‌మెంట్ ధరలను ఫిక్స్ చేస్తూ జూన్ 15న ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఐసోలేషన్‌‌‌‌ బెడ్‌‌‌‌కు రోజుకు గరిష్టం గా రూ.4 వేలు, ఐసీయూలో రోజుకు రూ. 7,500, వెంటిలేటర్‌‌‌‌‌‌‌‌కు రోజుకు రూ. 9 వేలు చార్జ్ చేయాలంది. డాక్టర్ ఫీజులు, నర్సింగ్ చార్జెస్, కొన్ని రకాల టెస్టులు, పేషెంట్‌‌‌‌కు అందించే ఫుడ్ వంటిి ఇందులోనే కవర్ అవుతాయని.. హైఎండ్‌‌‌‌ ప్రొసీజర్స్‌‌‌‌, డ్రగ్స్‌‌‌‌ కు మాత్రమే వేరుగా చార్జ్‌‌‌‌ చేసుకోవాలంది. అది కూడా గతేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌ నాటి ధరల ప్రకారమే చార్జ్‌‌‌‌ చేయాలంది. కానీ ఒక్క హాస్పిటల్ మేనేజ్ మెంట్ కూడా ఈ ఆదేశాలను లెక్క చేయట్లేదు. అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. వేల ఫిర్యా దులొచ్చినా చర్యలు తీసుకునేందుకు సర్కార్ ధైర్యం చేయడం లేదు. రెండు దవాఖాన్లపై నామమాత్రపు చర్యలు తీసుకుని వదిలేసింది.

బుజ్జగించినా ఒప్పుకోవట్లే

ఎన్ని హెచ్చరికలు చేసినా కార్పొరే ట్ హాస్పిటళ్లు లెక్క చేయకపోయే సరికి ప్రభుత్వమే దిగొచ్చింది. సగం బెడ్లలో ఇష్టమొచ్చినట్లు బిల్లు లు వేసుకున్నా మిగిలిన సగం రీజనబుల్‌‌‌‌గా చార్జ్‌‌‌‌ చేయాలని బేరానికి దిగింది. ఈ నెల 13న కార్పొరే ట్ హాస్పి టళ్ల ఓనర్లతో మంత్రి ఈటల రాజేందర్ సమావేశం నిర్వహించారు. సగం బెడ్లు సర్కార్‌‌‌‌‌‌‌‌కు ఇచ్చేం దుకు ఓనర్లు ఒప్పకున్నారని ప్రకటన చేశారు. దీనిపై కార్పొరే ట్ మేనేజ్ మెంట్లూ నోరు విప్పలేదు. ఆ తర్వాతి రోజు కార్పొరే ట్ ప్రతినిధులతో పబ్లిక్ హెల్ త్డైరెకర్్ట , మెడికల్ ఎడ్యుకే షన్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌తో భేటీ అయ్యారు . సగం బెడ్లలో రీజనబుల్‌‌‌‌గా చార్జ్ చేయాలంటే మిగిలిన సగం బెడ్లలో తమ ఇష్టానికి వసూలు చేసుకుంటా మని ప్రతిపాదిం చారు. ఈ ప్రతిపాదనకు అంగీకరించిన అధికారులు, సగం బెడ్లలో గరిష్టం గా 14 రోజుల ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌కు రూ.4 లక్షలకు మించి తీసుకోవద్దని కోరారు. దీనిపై తాము చర్చించుకుని సమాధానం చెప్తామని వెళ్లిన కార్పొరేట్ మేనేజ్ మెంట్లు .. ఇప్పటికీ ఏ విషయమూ చెప్పడం లేవు.

రోజుకు రూ. 50 వేల నుంచి లక్ష వసూలు

సగం బెడ్ల పేరిట ఓ వైపు సర్కార్‌‌‌‌తో బేరాలు ఆడుతూనే, మరోవైపు తమ దోపిడీని కార్పొరేట్ దవాఖాన్లు కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వ జీవో, ఆర్డర్లతో సంబంధం లేకుండా ఒక్కో పేషెంట్ వద్ద రోజుకు రూ. 50 వేల నుంచి లక్ష వసూలు చేస్తున్నాయి. వీఐపీలతో రికమెండేషన్‌‌ చేయిం చుకుని, లక్షల్లో అడ్వాన్స్ కడితే తప్ప బెడ్లు ఇస్తలేవు. డాక్టర్లు, హెల్త్ స్టాఫ్ వాడుతున్న పీపీఈ కిట్ల ధరలు, సీటీ స్కాన్ వంటి టెస్టు ల ధరలు, మందుల ధరలన్నింటి వివరాలతో హాస్పిటల్ ఎంట్రన్స్‌‌ లో బోర్డులు ఏర్పాటు చేయాలని వారం కిం దకార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులకు హెల్త్​ డిపార్ట్ మెంట్ ఆర్డర్స్​ ఇచ్చింది. కానీ ఇప్పటి దాకా ఒక్క హాస్పిటల్‌‌ కూడా బోర్డులు పెట్టలేదు. మలక్‌ పేట్‌‌లోని ఓ హాస్పిటలైతే జీవో ప్రకారం చార్జ్ చేయడం కుదరదంటూ డీఎంహెచ్‌ వోకు లెటర్ రాసింది.