సంగారెడ్డి జిల్లాలో ప్రేమ పెండ్లి చేసుకుందని అబ్బాయి ఇంటికి నిప్పుపెట్టారు!..

సంగారెడ్డి జిల్లాలో ప్రేమ పెండ్లి చేసుకుందని అబ్బాయి ఇంటికి నిప్పుపెట్టారు!..
  • సంగారెడ్డి జిల్లాలోని కక్కర్ వాడలో ఘటన 

ఝరాసంగం, వెలుగు: కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేని కుటుంబసభ్యులు అబ్బాయి ఫ్యామిలీపై దాడి చేసి ఇంటికి నిప్పుపెట్టిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఎస్ఐ పాటిల్​క్రాంతికుమార్​కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఝరాసంగం మండలం కక్కర్ వాడ గ్రామానికి చెందిన గొల్ల విఠల్​కూతురు అదే గ్రామానికి చెందిన బోయిని నగేశ్ ను కొద్దిరోజుల కింద  ప్రేమ పెండ్లి చేసుకుంది. 

ఇది ఇష్టంలేని యువతి తండ్రి విఠల్ తన కొడుకు పాండుతో కలిసి నగేశ్ తో పాటు అతని తండ్రి రాములుపై దాడికి పాల్పడి, ఆపై ఇంటికి నిప్పు పెట్టారు. స్థానికులు చూసి అగ్నిమాపక సిబ్బందికి ఫోన్​చేయగా వచ్చి మంటలు ఆర్పారు. బోయిని నగేశ్​ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.