ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఎక్కడ?

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఎక్కడ?

ఎల్లారెడ్డి: ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఎక్కడ అని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. ఏడేళ్లైనా ఇచ్చిన హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘మన ఊరు, మన పోరు’ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న షబ్బీర్ అలీ మాట్లాడుతూ... ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని సీఎం చెబుతున్నారని, అలాంటప్పుడు వరి వేయొద్దని ప్రజలకు ఎందుకు చెప్పారో కేసీఆర్ వివరించాలని డిమాండ్ చేశారు. వరి వేస్తే ఉరే అంటూ సీఎం కేసీఆర్ రైతులను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేది లేదని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఢిల్లీ యాత్ర అంటూ కొత్త నాటకం ఆడుతున్నారన్నారు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలో చేతకాకపోతే దిగిపోవాలని, తాము వచ్చాక ప్రభుత్వ పాలనను చక్కదిద్దుతామన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎల్లారెడ్డికి సేవ చేస్తున్నానని, ఆర్టీసీ డిపో కోసం భూమిని ఇచ్చానని షబ్బీర్ తెలిపారు. కాంగ్రెస్ లో గెలిచిన స్థానిక ఎమ్మెల్యే సురేందర్ కేసీఆర్ కు అమ్ముడుపోయారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటమితప్పదని హెచ్చరించారు. 

ఇవి కూడా చదవండి...

ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతుండగా కుప్పకూలిన గ్యాలరీ

నకిలీ స్టికర్లతో తిరిగితే కఠిన చర్యలు