తెలంగాణలో ఆత్మగౌరవం ఎక్కడుంది ?

తెలంగాణలో ఆత్మగౌరవం ఎక్కడుంది ?

ఖమ్మం జిల్లాల: తెలంగాణలో ఆత్మగౌరవం ఎక్కడుందని ప్రశ్నించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల. కేసీఆర్ పాలనలో ఏ వర్గం ప్రజలు ఆనందంగా ఉన్నారో చెప్పాలని.. రైతులను దొంగలుగా సృష్టించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం తాళ్లపెంటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరులకు ఈ సందర్భంగా ఆమె నివాళులర్పించారు. ఉద్యమానికి ఊపిరిలూదిన మేధావులకు, ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులకు, ప్రాణత్యాగం చేసిన అమరులకు, గజ్జెకట్టి, గొంతు విప్పిన కళాకారులకు, కవితలు, పాటలతో ఉరకలెత్తించిన కవులకు, కలంతో ఉద్యమాన్ని వెలుగెత్తిన పాత్రికేయులకు షర్మిల రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 
అనంతరం రైతు గోస దీక్షలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబంలో మాత్రమే ఐదు ఉద్యోగాలచ్చాయన్నారు. డిగ్రీలు, పీజీలు చేసిన వారు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి ఏర్పడిందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరవీరులు కలలు కన్న తెలంగాణను సాధించేందుకు పోరాటం చేద్దామని షర్మిల పిలుపునిచ్చారు. 


 

 

ఇవి కూడా చదవండి

లైవ్ అప్ డేట్స్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కాలుష్యం గుప్పిట్లో యమునా నది

మోడీని కలిసిన నిఖత్ జరీన్, మనీశా మౌన్, పర్వీన్ హుడా