లైవ్ అప్ డేట్స్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

లైవ్ అప్ డేట్స్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిలో గుత్తాసుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్.. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధితో దూసుకుపోతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం సాధించలేని విజయాలను 8 ఏండ్లలో సాధించామన్నారు. అందుకే తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికంగా మారిందన్నారు.

అమరవీరుల స్థూపానికి కాంగ్రెస్ నేతల  నివాళులు

రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరవీరుల స్థూపానికి కాంగ్రెస్ నేతలు  నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క ..తెలంగాణ  వస్తే  అన్ని వర్గాల  వారు బాగుంటారని  అందరూ ఆశించారన్నారు. సామజిక తెలంగాణ ఏర్పడుతుందనుకున్నాం కానీ.. తెలంగాణ  ఆశయాలు ఏ  మాత్రం  సహకారం  కాలేదని తెలిపారు. కాంగ్రెస్  పార్టీతోనే రాష్ట్ర  సాధన లక్ష్యాలు  సాధ్యమవుతాయని చెప్పారు. మిగులు  బడ్జెట్  పోయి ... రాష్ట్రాన్ని అప్పుల  పాలు  చేశారని తెలిపారు భట్టి విక్రమార్క. మాజీమంత్రి గీతా రెడ్డి మాట్లాడుతూ.. సోనియా  గాంధీ  తెలంగాణ  రాష్ట్రాన్ని  ఇచ్చారని తెలిపారు. సుదీర్ఘ  పోరాటంలో  అనేక  మంది రాష్ట్రం  కోసం త్యాగాలు  చేశారని..రాష్ట్రంలో  ఏ వర్గం  సంతోషంగా  లేదన్నారు. పొన్నాల  లక్ష్మయ్య  మాట్లాడుతూ.. సోనియా  గాంధీ చిత్తశుద్ధితో  రాష్ట్రం  ఏర్పడిందని , రాష్ట్రాన్ని ప్రాజెక్టుల పేరుతో  దోచుకున్నరు  తప్ప చేసిందేమీలేదన్నారు. నిరుద్యోగ నియామకాలు పక్కన  పెట్టి ... కేసీఆర్  కుటుంబంలోనే పదవులు ఇచ్చుకున్నారని చెప్పారు. మంత్రి నిరంజన్ మాట్లాడుతూ.. తెలంగాణ  కోసం  అనేక మంది ప్రాణ  త్యాగాలు చేశారని ..వారి త్యాగాలు వెల కట్టలేనివి  అన్నారు. అంజన్  కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర  ఏర్పాటులో  ఎన్ని అవరోధాలు వచ్చిన  కాంగ్రెస్  అధినేత సోనియా  గాంధీ  రాష్ట్రాన్ని  ఇచ్చి మాట నిలబెట్టుకున్నారని తెలిపారు.

ఈ సంబుర సమయం..మరో సమరానికి నాంది: రేవంత్

ఎనిమేదేళ్ల కేసీఆర్ పాలనలో  ప్రతి ఒక్కరికీ ఏడుపే మిగిలిందని ట్వీట్ చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.   ‘తెలంగాణకు గులాబీ చీడ పట్టుకుంది.   అమరుల త్యాగాలకు  విలువ లేకుండా విధ్వంస  పాలన సాగిస్తున్న గులాబీ చీడను తరిమి కొట్టాలి. 85 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందించాం.యువతకు ఉపాధి కల్పించి సకల జనుల జీవితాల్లో వెలుగులు నింపే తెలంగాణ కోసం కాంగ్రెస్ శ్రమిస్తుంది’. 

 

కేసీఆర్ రైతు ద్రోహి: బండి సంజయ్

లాక్ డౌన్ లో పేదల ను ఆదుకున్నాం. విమానాలు,రైళ్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేశాం. కరోనా రోగులను కాపాడాం. 190 కోట్ల వ్యాక్సినేషన్ వేశాం. గతంలో ఇతర దేశాల సాయం కోసం ఎదురుచూసే పరిస్థితి. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద 80కోట్ల మందికి గోధుమలు, బియ్యం సెప్టెంబర్ వరకు ఉచితంగా అందజేసేందుకు ప్రయత్నం.రేషన్ డీలర్లను బెదిరించి ఒక్కో కిలోకు రూపాయి చొప్పున అమ్ముకుంటుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 20 కోట్ల మంది పేదలకు ఇళ్లను కట్టిచ్చాం. ఇప్పటికే 4 కోట్ల మందికి ఇళ్లు నిర్మించినం. బీజేపీ అధికారంలోకి వస్తే అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తాం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకు మూడు దఫాలుగా 6 వేల రూపాయలు వారిఅకౌంట్లలో జమ చేసింది. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. రైతును రాజు చేయాలని వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతు బికారీ అవుతున్నరు .వరి వేస్తే ఉరి అని రైతులను బెదిరిస్తున్నారు.రైతు బందు ఇచ్చి అన్ని సబ్సిడీలు రద్దు చేశారు.  అనాలోచిత విధానాలతో కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారు. కేసీఆర్ రైతు ద్రోహి..మద్దతు ధర కోసం రైతులు ధర్నా చేస్తే మిర్చి రైతుల సంకెళ్లు వేసింది ప్రభుత్వం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ సహకరించడం లేదు. ఇప్పటికే 70 శాతం మంది తక్కువ ధరకే అమ్ముకున్నరు. కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. తరుగు, తాలుతో క్వింటాల్ కి ఆరు కిలోలు తీసివేస్తున్నారు. వర్షాలకు వడ్ల కుప్పలు కొట్టుకుపోయాయి.రైతులను బికారిని చేసి రాక్షసానందం పొందుతున్నారు కేసీఆర్

కుటుంబ పాలనతో రాష్ట్రం అప్పులపాలు: వివేక్ వెంకటస్వామి

తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా గురువారం ఉదయం ఢిల్లీలో తెలంగాణ భవన్ లోని అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి వివేక్ వెంకటస్వామి పుష్పాంజలి గటించారు.  ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ ప్రజలు ఆశించినట్లు రాష్ట్రంలో అభివృద్ధి జరగడంలేదన్నారు. 8 సంవత్సరాల్లో పేదలు పేదలుగానే ఉన్నారని, అప్పుల రాష్ట్రంగా తయారైందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కుటుంబ పాలన వలన రాష్ట్రం వెనకబడిపోయిందన్నారు. ప్రతి ఇంటికి ఉద్యోగం, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటి వరకు ఎవ్వరికీ అందలేదని..తెలంగాణ రాష్ట్రం అవినీతిలో నెంబర్ వన్.. కుటుంబ పాలన వల్ల వెనకబడిపోయిందన్న వివేక్ వెంకటస్వామి.. తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిపోయిందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ఎన్నో సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని తెలిపారు వివేక్ వెంకటస్వామి.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే  బీజేపీకే సాధ్యం: కిషన్ రెడ్డి

భారత ప్రభుత్వం తరుపున తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ప్రజలందరికీ శుభాకాంక్షలు అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా గురువారం ఉదయం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లోని అమరవీరుల స్థూపానికి నివాళి, తెలంగాణ తల్లి విగ్రహానికి  కిషన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి పుష్పాంజలి గటించారు.  దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల అవతరణ దినోత్సవాలను కేంద్రం ఘనంగా నిర్వహిస్తుందన్నారు. కవులు, కళాకారులు, విద్యార్ధులు, జర్నలిస్టులు , సకల జనులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు. తెలంగాణ సాధనలో బీజేపీ కీలకంగా ఉందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వాళ్లందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నా అన్నారు. తెలంగాణ కోసం సుష్మాస్వరాజ్ గొంతెత్తిన విషయం అందరికీ తెలిసిందేనని.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే  బీజేపీకే సాధ్యమన్నారు.

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సాయంత్రం  6 గంటలకు ఢిల్లీలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధాని మోడీతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని .. ఎంతో మంది కళాకారులు పాల్గొంటారని చెప్పారు. తెలంగాణ అమరవీరుల స్థూపానికి, తెలంగాణ తల్లికి నివాళులు అర్పిస్తామన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఎన్నో స్కీంలు వచ్చాయని, ఉపాధి.. గ్రామాల్లో మౌళిక వసతులకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తుందని చెప్పారు. రీజనల్ రింగు రోడ్డు, రైల్వేకు పెద్ద ప్యాకీజీ అమలు చేశామన్నారు. తెలంగాణలో మౌలిక సదుపాయాలు రోడ్లు రవాణా , రైల్వే , హాస్పిటల్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో నిధులు కేటాయిస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని  కరోనా సమయంలో బియ్యం, డబ్బులు అందించి తెలంగాణ ప్రజలకు అండగా నిలిచిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. 

రైతును రాజుగా చూడాలన్నదే కేసీఆర్ లక్ష్యం: కేటీఆర్

వ్యవసాయాన్ని పండుగ చేసి... రైతును రాజుగా చూడాలన్నదే కేసీఆర్ లక్ష్యం. ఆ ఉద్దేశంతోనే దేశంలోనే తొలిసారి గా రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టింది. సుస్థిర ఆదాయం రావాలనే ఆయిల్ ఫామ్ సాగుకు రూ.1000 కోట్లు కేటాయించాం.ఉద్యాన వనాలు, పండ్ల తోటలు,పంట నిల్వ కోసం పెద్ద ఎత్తున గోదాములు ఏర్పాటు చేశాం. రైతు బీమా పథకం,చేప పిల్లల పెంపకం, మత్స్య పరిశ్రమకు ప్రోత్సాహం, కాళేశ్వరం, పచ్చని మొక్కలతో హరిత విప్లవం, మాంస ఉత్పత్తితో గులాబీ విప్లవం, చేపల పెంపకం ద్వారా నీలి విప్లవం, పాల ఉత్పత్తితో శ్వేత విప్లవాలను సాధించాం. వృద్ధులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు తదితరులకు ఆసరా పెన్షన్ తో ఆదుకుంటున్నాం. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం ద్వారా 18 సంవత్సారాలు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను పొందుపరిచి కార్డులు అందజేయడం జరుగుతుంది.విద్యతోనే భవితకు పునాది, భావితరాలకు పురోగతి అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెడుతున్నం.

రెండేళ్లలో జిల్లాకో వైద్య కళాశాల 

తెలంగాణ ప్రాంతంలో గతంలో మూడు వైద్య కళాశాలలే ఉన్నాయి. ఇక జిల్లాకు ఒకటి వైద్య కళాశాల ఏర్పాటు చేయడమే లక్ష్యం. రాబోయే రెండేళ్లలో ఏర్పాటు చేస్తాం. గడిచిన 8 ఏళ్లలో ఒక లక్షా 33 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాం.ప్రస్తుతం ఆయా శాఖల్లో ఖాలీగా ఉన్న 91,142 వేల ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేస్తుంది. 11వేలకుగాపై కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాం. స్థానికులకు 95శాతం రిజర్వేషన్లు సాధించిన ఏకైక రాష్ట్రంతెలంగాణ

ప్రభుత్వ ఆస్పత్రుల్లో 57 వైద్య పరీక్షలు ఉచితం

తెలంగాణ నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచాం. 57 వైద్య పరీక్షలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి జిల్లాలో డయాగ్నస్టిక్స్ సెంటర్లను ఏర్పాటు చేశాం. కిడ్నీ సంబంధిత సమస్యలతో భాధపడే వారి కోసం 42 ఉచిత డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. 56 వేల ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి.ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంచాము. జీహెచ్ఎంసీ పరిధిలో 18 ప్రభుత్వ దవాఖాల్లో 5 రూపాయలకే భోజనం అందిస్తున్నాం.ప్రభుత్వ ఆస్పత్రులో ప్రసవాల సంఖ్యను పెంచడంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. కేసీఆర్ కిట్ పథకం ద్వారా 13 లక్షల 30 వేల మంది మహిళలకు లబ్ధి చేకూరింది. మాతా శిశు మరణాల సంఖ్య తగ్గింది.బస్తీ దవాఖానాల స్పూర్తితో గ్రామాల్లో పల్లె దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నాం.

 

2 లక్షల 91 వేల ఇల్లు మంజూరు చేశాం: కేసీఆర్

గూడులేని నిరుపేదలకు సొంతింటి కలను తీర్చేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తున్నామన్నారు.  ప్రభుత్వం పేదలకు ఉచితంగా. 2 లక్షల 91 వేల ఇల్లు మంజూరు చేసిందన్నారు. సొంత స్థలం కలిగిన వారికి..డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణానికి దశల వారీగా 3 లక్షలు మంజూరు చేసే కార్యక్రమం చేపట్టింది. ఇది నిరంతర ప్రక్రియ..చివరి లబ్ధిదారుడికి అందే వరకు ఈ పథకం.  విద్య రంగం వికాసం కోసం అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.దేశంలో అత్యధికంగా 978 గురుకుల విద్యాలయాలు కలిగిన రాష్ట్రం తెలంగాణ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా సమగ్ర శిక్షణ ఇస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు మన ఊరు, మనబడి కార్యక్రమానికి నాంది పలికింది.

తలసరి ఆదాయం పెరుగుదలలో తెలంగాణ రికార్డు

తెలంగాణ రాష్ట్రం తలససరి ఆదాయం పెరుగుదలలో కార్డు సాధించిందన్నారు సీఎం కేసీఆర్. 2014,15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.24,124 అయితే.. 2021, 22 నాటికి రూ.2,78,833కు పెరిగిందన్నారు. జాతీయ సగటు ఆదాయమైన రూ.1,49,848 కంటే ఇది 86శాతం ఆదాయం వచ్చిందన్నారు. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం రోజు రోజుకు పెరుగుతుందన్నారు.

85 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందించాం

మిషన్ భగీరధతో ఇంటింటికి మంచినీటి సరఫరా అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో మంచినీటి యుద్ధాలు లేవు, ఎక్కడా మహిళలు బిందెలు పట్టుకుని రోడ్ల మీదకు రావడం లేదు. వ్యవసాయ రంగం, రైతు సంక్షేమం కోసం అనేక సంస్కరణలు పథకాలు తీసుకొచ్చాం.రైతు రుణబారం తగ్గించడానికి రైతు రుణమాపీ చేశాం. సకాలంలో ఎరువులు, విత్తనాలు పంపిణీ, కల్తీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకున్నం. పంట కాలంలో పెట్టుబడి సాయం కోసం రైతు బంధు వ్యవసాయం దండుగ కాదు..పండుగ అని నిరూపించాం. ఇతర రాష్ట్రాలకు కూడా మన పథకాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. మిషన్ కాకతీయ గొలుసుకట్టు చెరువులు పునరుద్దరించుకున్నాం. చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. వేసవిలో కూడా చెరువులు జలకళను సంతరించుకున్నాయి. చేపల పెంపకం పెరిగింది..మత్స్యకారులు లబ్ధి పొందుతున్నారు.పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తిగా చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి చేశాం. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షలకుపైగా ఎకరాలకు సాగునీరు అందించాం. కోటి ఎకరాలకు పైగా సాగు నీరు అందించడమేధ్యైయంగా ముందుకు సాగుతున్నాం. దళితుల కోసం దళిత బంధు పథకాన్ని సామాజిక ఉద్యమంగా అమలు పర్చుకుంటున్నాం.దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు . ఈ పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం

తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపిక

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధితో దూసుకుపోతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం సాధించలేని విజయాలను 8 ఏండ్లలో సాధించామన్నారు. అందుకే తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికంగా మారిందన్నారు. పెరిగిన ఆదాయంలో ప్రతిపైసా రాష్ట్రాభివృద్ధికి వినియోగిస్తున్నామని చెప్పారు. ఆదాయ వనరులను పెంచుకుని..రికార్డుస్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పించామన్నారు. దేశ వార్షిక వృద్ధిరేటు కంటే రాష్ట్ర వార్షిక వృద్ధి రేటు అధికమన్నారు. కరోనా విపత్తులోనూ తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోయిందన్నారు. కరెంట్ కష్టాలకు చమరగీతా పాడామని..24 గంటలు నిరంతర నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ ను అందజేస్తున్నామన్నారు. నల్లగొండకు ఫ్లోరైడ్ పీడిత సమస్యను తీర్చామని స్పష్టం చేశారు. 

 

అమర వీరులకు కేసీఆర్ నివాళి 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గన్ పార్క్ లోని  అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

పూర్తిగా తెలుగులో ప్రసంగించిన గవర్నర్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ గురువారం ఉదయం రాజ్ భవన్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై పూర్తిగా తెలుగులో ప్రసంగించారు. ‘అందరికీ నమస్కారం’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘ఈ రాష్ట్రం నాది.. నేను ఈ రాష్ట్రానికి గవర్నర్ ను మాత్రమే కాదు.. మీ సహోదరిని’’ అని  పేర్కొన్నారు. తెలంగాణకు సేవ చేయడానికి ప్రధానమంత్రిగా గొప్ప అవకాశం ఇచ్చారు. నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. రాజ్ భవన్ స్కూలు లో భోజన కార్యక్రమం చేపట్టాను. కొవిడ్ సందర్భంగా నిరంతర పర్యవేక్షణ చేశాను.భద్రాచలం, ఆదిలాబాద్ ప్రాంతాలలో ఆదివాసీ ప్రజలను కలిసి సహపంక్తి భోజనం చేశాను. అక్కడి ప్రజలకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశాను. పేద విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లు అందించాం. రాష్ట్రానికి సేవ చేస్తూనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాను. కానీ నేను బాదపడటం లేదు. నా సేవ నా తెలంగాణ ప్రజలకు  నా సేవలు తెలంగాణ ప్రజలకు అందిస్తూనే ఉంటాను. ఎంతోమంది అమరుల త్యాగ ఫలితమే ఈ  తెలంగాణ . ఎవరు ఆపినా నేను తెలంగాణ ప్రజలను కలుస్తాను.. కలుస్తూనే ఉంటాను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఉదయం రాజ్ భవన్ లో ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా గవర్నర్ తమిళిసై కేక్ కట్ చేశారు.

 అసెంబ్లీలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

శాసన సభలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ప్రాంగాణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిలో గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాఆవిష్కరించారు.మహాత్మగాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు

ప్రగతి భవన్ లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

 ప్రగతి భవన్‌లో  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి  సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఎగురవేశారు.  ఈ కార్యక్రమంలో ఎంపీలు సంతోష్‌ కుమార్‌,  ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, వివేకానంద, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, పాల్గొన్నారు