ఇల్లు కట్టేటప్పుడు మెట్లు ఏ దిక్కునుండాలి?

ఇల్లు కట్టేటప్పుడు మెట్లు ఏ దిక్కునుండాలి?

ఇల్లు కట్టేటప్పుడు బోలెడు అనుమానాలు. ఎటువైపు ఏది కట్టాలి? ఎక్కడ ఏది పెట్టాలి? అనేది అర్థంకాదు. కిరాయికి దిగే ఇంట్లో అన్నీ కరెక్ట్‌‌‌‌గా ఉన్నాయా? లేదా? వాస్తు ప్రకారం కట్టారో? లేదో? అనే డైలమా. ఆ అనుమానాల్లో ఒకటి మెట్లు. అవి ఎటు ఉండాలి? దాని కింద ఏదైనా పెట్టుకోవచ్చా? లేదా? అంటూ బోలెడు సందేహాలు. 

ఇంట్లో మెట్లు కట్టేటప్పుడు ఫస్ట్‌‌‌‌ ప్రిఫరెన్స్‌‌‌‌ నైరుతి మూలన వచ్చేలా చూసుకుంటే చాలా మంచిది. అలా కుదరని పక్షంలో సెకండ్‌‌‌‌ ప్రిఫరెన్స్‌‌‌‌ ఉత్తర వాయువ్యంలో మెట్లు పెట్టుకోవచ్చు. అవి రెండూ కాకపోతే చివరి ఆప్షన్‌‌‌‌ కింద ఆగ్నేయ భాగం ఎంచుకోవాలి. ఇదిలా ఉంటే.. కొంతమంది మెట్ల కింద బాత్‌‌‌‌రూమ్‌‌‌‌ లాంటివి కట్టుకుంటారు. అయితే, నైరుతిలో మెట్లు కట్టుకుంటే దాని బాత్‌‌‌‌రూమ్‌‌‌‌ ఉండకూడదు. స్టోర్‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌ లాంటిది ఉంటే బెటర్‌‌‌‌‌‌‌‌. ఉత్తర వాయువ్యంలో, ఆగ్నేయ భాగంలో మెట్లు కట్టుకున్నప్పుడు బాత్‌‌‌‌రూమ్‌‌‌‌ ఉండొచ్చు. ఇక డూప్లెక్స్‌‌‌‌ విషయానికొస్తే  ఇంటికి లోపలివైపు మెట్లు పెట్టుకుంటాం. కాబట్టి నైరుతిలో మెట్లు ఉంటే మంచిది. అలాకాకుండా ఇంటి మధ్యలో కూడా మెట్లు కట్టొచ్చు. ఇంటికి తూర్పు వాకిలి ఉంటే ఆగ్నేయంలో మెట్లు కట్టాలి. ఉత్తర వాకిలి ఉంటే  వాయువ్యంలో ఉండాలి. దక్షిణ వాకిలి ఉంటే నైరుతిలో, పడమర వాకిలి ఉంటే నైరుతి, వాయువ్యంలో ఎటైనా కట్టుకోవచ్చు. కొంతమంది ఇంటి ముందు, వెనుకవైపు మెట్లు కట్టుకుంటారు. ఈశాన్యం వైపు తప్ప మిగతా మూడు వైపులా మెట్లు కట్టుకోవచ్చు.

ప్రహరి గోడ కట్టొచ్చా? 

మెట్ల పక్కన ప్రహరి గోడ కట్టొచ్చు. నైరుతి, వాయువ్యంలో మెట్లు కట్టినప్పుడు ప్రహరిగోడ మెట్లకు ఆనుకోవచ్చు. ఆగ్నేయ భాగంలో కడితే మాత్రం గ్యాప్‌‌‌‌  ఉండాలి. ప్రహరి గోడ కట్టేటప్పుడు ముందుగా వాస్తు ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌ను కలిస్తే   మంచిది.

ఐరన్‌‌‌‌స్టెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేస్‌‌‌‌

స్టెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేస్‌‌‌‌ ఏదైనా పర్లేదు. ఐరన్‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ, స్టెయిన్‌‌‌‌లెస్‌‌‌‌ స్టీల్‌‌‌‌, చెక్క ఏదైనా వాడొచ్చు. కానీ, మెట్లు మాత్రం వాస్తు ప్రకారం కట్టాల్సిన దగ్గర కట్టాలి. ఇంటి బయట నుంచి మెట్లు పెట్టుకున్నా ఇబ్బంది ఉండదు. 

వాస్తు టిప్స్‌‌‌‌

ఈ రోజుల్లో ప్రతీ ఇంటిని లావిష్‌‌‌‌గా కట్టుకుంటున్నారు. దాంట్లో భాగంగానే బాత్‌‌‌‌రూమ్‌‌‌‌ ఇంటీరియర్‌‌‌‌‌‌‌‌ కూడా చాలా అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు. రకరకాల అద్దాలు అమర్చుకుంటున్నారు. అయితే, వాస్తుపరంగా వాటిని కచ్చితంగా తూర్పు లేదా ఉత్తరం వైపు మాత్రమే పెట్టాలి. ఎందుకంటే అద్దాలు... డైరక్షన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఎనర్జీ సోర్స్‌‌‌‌ కాబట్టి. 

  • బిజినెస్‌‌‌‌ చేసేవాళ్లు ఆఫీసులు, ఫ్యాక్టరీల్లో వాయువ్యంలో అరోమెటిక్‌‌‌‌ గార్డెన్లు ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే  కస్టమర్‌‌‌‌‌‌‌‌ రిలేషన్‌‌‌‌ మెరుగుపడుతుంది. 
  • ఇంట్లో తులసి చెట్లు పెట్టుకుంటే మంచి జరుగుతుంది. 
  • పెద్ద పెద్ద ఆకులున్న మనీ ప్లాంట్‌‌‌‌ను ఇంట్లో పెట్టుకుంటే అభివృద్ధి, సక్సెస్‌‌‌‌ వస్తుంది.  
  • వెదురు మొక్క ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. 
  • తూర్పు దిక్కు లేదా ఈశాన్యంలో వాటర్‌‌‌‌‌‌‌‌ ఫౌంటెయిన్‌‌‌‌, ఫ్లవర్‌‌‌‌‌‌‌‌ వాజులు ఏర్పాటు చేయడం వల్ల ఇంటిలో, ఇంటి సభ్యుల్లో ఎనర్జీ లెవల్స్‌‌‌‌ పెరుగుతాయి.