రన్నింగ్​, జంపింగ్  ఏది బెటర్​?

రన్నింగ్​, జంపింగ్  ఏది బెటర్​?

రన్నింగ్​, జంపింగ్ ఈ రెండూ ఈజీగా ఎక్కడైనా చేయగలిగే ఎక్సర్​సైజ్​లు​. క్యాలరీలు కరగాలన్నా, ఫిట్​గా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా రన్నింగ్, జంపింగ్​ రోప్​​ మంచి ఛాయిస్. ‘ఈ రెండు వ్యాయామాల్ని అలసట తెలియకుండా ఎక్కువసేపు చేయొచ్చు. ఇవి చేస్తే బరువు కంట్రోల్​లో ఉంటుంది. ఫిట్​గా ఉండొచ్చు కూడా. గుండె కండరాలు స్ట్రాంగ్ అవుతాయి’ అంటున్నాడు లైఫ్​స్టయిల్​, ఫిట్​నెస్​ ఇన్​ఫ్లుయెన్సర్​ మయూర్​ ఘరత్.
జంపింగ్​ రోప్​తో...
క్యాలరీలు త్వరగా కరగాలంటే రన్నింగ్​ కంటే జంపింగ్​ రోప్​ చేయడమే బెటర్​. రోజూ పది నిమిషాల చొప్పున  అరగంట సేపు తాడాట ఆడితే దాదాపు 480 క్యాలరీలు ఖర్చవుతాయి. తాడాట ఆడితే వీపు భాగంలోని కండరాలు బలపడతాయి. శరీరాన్ని బ్యాలెన్స్​ చేయడం ఈజీ అవుతుంది. మొత్తం మీద స్టామినా పెరుగుతుంది. 
రన్నింగ్ చేస్తే...
రన్నింగ్​ చేస్తే గుండె కండరాలు బలపడతాయి. కొలెస్ట్రాల్​ తగ్గుతుంది. పరిగెత్తినప్పుడు రిలాక్సింగ్​ హార్మోన్స్​ అయిన ఎండార్ఫిన్, సెరటోనిన్​ రిలీజ్​ అవుతాయి. దాంతో మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఊపిరితిత్తుల్లో ఎక్కువ ఉన్న కార్బన్​డయాక్సైడ్ బయటకి పోతుంది. శ్వాస వ్యవస్థలోని కండరాలు స్ట్రాంగ్ అవుతాయి. లంగ్స్​లో ఏవైనా సమస్యలుంటే తగ్గిపోతాయి.