షర్బత్ ను తెలుగులో ఏమంటారు.. ఎక్కడి నుంచి వచ్చింది.. ఎలా పుట్టింది..

షర్బత్ ను తెలుగులో ఏమంటారు.. ఎక్కడి నుంచి వచ్చింది.. ఎలా పుట్టింది..

కొన్ని కొన్ని పదాలు తరచుగా వాడుతుంటాం.  వాటికి అర్దం ఏమిటో తెలియక పోయినా.. సందర్భానుసారంగా వాడుతుంటాం.. అలాంటి పదాలు ఏ భాషలో ఉద్భవించాయో కూడా తెలియదు.. కాని పల్లెల్లో కూడా తరచుగా వాడుతుంటారు.  అలాంటి పదమే షర్బత్​.. ఈ పదం ఏ భాష నుంచి ఉద్భవించింది..హిందీలో దీనిని ఏమంటారు.. తెలుగులో షర్బత్అంటే ఏమిటో తెలుసుకుందాం. . . 

ఎండాకాలంలో పల్లెలకు వెళితే షర్బత్​ అనే పదం ఎక్కువుగా వినపడుతుంది. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే కూల్​ షర్బత్​ ఇచ్చి గౌరవిస్తారు.  చాలా రకాల కూల్​ డ్రింక్స్​ ఉన్నా.. ఇప్పటికీ చాలామంది షర్బత్ ​ నే తాగుతారు.  ఇది దాహం తీర్చడమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంటుంది. షర్బత్​ అనేది పర్షియన్​ పదం. ఇది టర్కిష్​ భాష నుంచి వచ్చింది.  టర్కిష్​ లో దీనిని షర్బెట్​ అంటారు.   దీని అర్దం త్రాగడానికి వీలుగా ఉండే విలువైన ద్రవ పదార్దం.  మరి కొంతమంది షరీబా అనే అరబిక్​ పదం నుంచి వచ్చిందని చెబుతారు.. షరీబా అంటే మద్యపానం అని అర్దం..  

ఇక ప్రాచీన భారత దేశంలో షర్బత్​ను పనక అని అంటారు.  ఈ పదాన్ని మన పురాణాలు. ఆధ్యాత్మిక గ్రంథాలు, ఇతిహాసాల్లో కూడా ప్రస్తావించారు.  పండ్ల రసంతో తయారు చేసిన దానిని పానక అంటారు.  అర్థశాస్త్రంలో దీనిని మధుపరక అని పేర్కొన్నారు. మధుపరకను తేనె, పెరుగు, నెయ్యి, కొన్ని రకాల పండ్ల రసాలతో తయారు చేస్తారు.  గతంలో ఈ ద్రావకాన్ని 5 నెలల గర్భిణి స్త్రీలకు ఇచ్చేవారు.  పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు దీనిని ఇచ్చి సత్కరించేవారు. పూర్వకాలంలో  కొత్తగా పెళ్లయిన వారు అత్తగారింటికి వెళ్లినప్పుడు ఈ ద్రావకం కంపల్సరీ..

భారతదేశాన్ని మొఘల్​ చక్రవర్తులు పరిపాలించినప్పుడు అనేక రకాల షర్బత్​లు వచ్చాయి.  వారు మంచి సుగంధ ద్రవ్యాలతో షర్బత్​ లు తయారు చేసేవారు.  ప్రస్తుతం గులాబీ రంగు షర్బత్​ వాడుకలో ఉంది.  దీనిని జహంగీర్​ రాణి నూర్జహాన్​ మొట్టమొదటగా తయారు చేశారట.  ఆమె తన రాజుకు ఫలూదా అనే షర్బత్​ ఇచ్చేవారట.  పెర్షియన్​ వారు దీనిని షికంజాబిన్​ అని పిలుస్తారు. ఈజిప్టులో, చక్కెర మరియు గులాబీతో రుచిగల పానీయం తయారు చేసి షర్బత్​ గా పిలిచారు.. ఇదండి షర్బత్​ పదానికి ఉన్న అసలైన చరిత్ర..