చెక్ డ్యాం కోసం తవ్వుతుంటే..కాకతీయుల నాటి చెన్నకేశవ విగ్రహం బయటపడింది

చెక్ డ్యాం కోసం తవ్వుతుంటే..కాకతీయుల నాటి చెన్నకేశవ విగ్రహం బయటపడింది

హైదరాబాద్, వెలుగు: మహబూబ్‌నగర్‌‌ జిల్లా చిన్నచింతకుంట మండలం ముచ్చింతలలో కాకతీయుల కాలం నాటి చెన్నకేశవ స్వామి విగ్రహం సోమవారం వెలుగు చూసింది. గ్రామ సమీపంలోని ఊక చెట్టు వాగు మీద చెక్‌ డ్యామ్ నిర్మాణం కోసం ఇసుక తీస్తుండగా నల్లశానపు రాతి విగ్రహం బయటపడింది. దీంతో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌‌ రెడ్డికి సమాచారం అందించగా, ఆయన పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ చైర్మన్‌ శివనాగి రెడ్డికి విషయం చెప్పారు.

ఈ విగ్రహం నాలుగు అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు, 6 అంగుళాల మందం ఉంది. ఇది చెన్నకేశవ స్వామి విగ్రహమని, కాకతీయుల కాలానికి చెందినదిగా శివనాగిరెడ్డి తెలిపారు. కాకతీయుల చివరి పాలకుడైన ప్రతాప రుద్రుడిని ఢిల్లీ సుల్తానులు బందీగా తీసుకెళ్లిన సందర్భంగా ఆలయాలపై జరిగిన దాడుల నుంచి విగ్రహాన్ని రక్షించుకునేందుకు స్థానికులు దీన్ని భూమికి 15 అడుగుల లోతులో భద్రపరచారని వెల్లడించారు.