బబుష్కా లేడీ: ఇంతకీ ఎవరామె? అలా ఎందుకు ప్రవర్తించింది?

బబుష్కా లేడీ: ఇంతకీ ఎవరామె? అలా ఎందుకు ప్రవర్తించింది?

అగ్రదేశం అమెరికా ఒకప్పటి ప్రెసిడెంట్‌‌‌‌ని ఎవరో కాల్చి చంపారు. దాంతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారింది. అక్కడున్న వాళ్లంతా ప్రాణభయంతో తలోదిక్కుకు పారిపోతున్నారు. పోలీసులు అలర్ట్‌‌‌‌ అయ్యి హంతకుడు ఎవరో తెలుసుకునేందుకు డేగ కండ్లతో చూస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఒకావిడ మాత్రం అసలేమీ జరగనట్టు నిలబడి చూస్తోంది. అందరూ భయంతో పరుగులు తీస్తుంటే ఆమె మాత్రం తాపీగా ఫొటోలు తీసుకుంటోంది. ఇంతకీ ఎవరామె? అలా ఎందుకు ప్రవర్తించింది? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. నవంబర్ 22, 1963.. అమెరికా ప్రెసిడెంట్ జాన్‌‌‌‌ ఎఫ్‌‌‌‌ కెనెడీ డల్లాస్‌‌‌‌లోని డీలీ ప్లాజాకు చేరుకున్నాడు. ఓపెన్‌‌‌‌ టాప్ కారులో కూర్చుని ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్నాడు. సడెన్‌‌‌‌గా గన్‌‌‌‌ పేలిన శబ్దం వినిపించింది. చూస్తే.. కెనెడీ తలలో బుల్లెట్‌‌‌‌ దిగింది. వెంటనే మరో బుల్లెట్‌‌‌‌ దూసుకొచ్చి టెక్సాస్‌‌‌‌ గవర్నర్‌‌‌‌‌‌‌‌కి తగిలింది. ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఒక్కసారిగా అంతా అలర్ట్‌‌‌‌ అయ్యారు. అక్కడినుంచే పారిపోయారు. 

హంతకుల కోసం పోలీసుల ఎంక్వైరీ మొదలైంది. కొందరు అనుమానితులను అరెస్ట్‌‌‌‌ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపేందుకు ఒక కమిషన్‌‌‌‌ వేశారు. ఎఫ్‌‌‌‌బీఐ కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్‌‌‌‌ చేసింది. ఆ ఇన్వెస్టిగేషన్‌‌‌‌లో భాగంగా కెనెడీ హత్య జరిగినప్పుడు తీసిన ఫొటోలన్నింటినీ తెప్పించుకుని చూశారు. అందులో ఒకావిడ అనుమానాస్పదంగా కనిపించింది. అక్కడివాళ్లంతా పారిపోవడానికి ట్రై చేస్తుంటే ఆమె మాత్రం కెనెడీ వైపు చూస్తూ నిల్చుంది. కాల్పులు జరిగేటప్పుడు అందరూ కిందికి వంగితే, ఆమె మాత్రం ధైర్యంగా నిలబడి, కెమెరాతో ఫొటోలు తీస్తోంది. దాంతో పోలీసులు ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఆమె ఎవరు?
పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా..  ఆమె ఎవరనేది తెలుసుకోలేకపోయారు. ఎఫ్‌‌‌‌బీఐ కూడా ఆమె గురించి చాలా కాలం ఎంక్వైరీ చేసింది. కానీ.. వివరాలు కనుక్కోలేకపోయింది. ఆమె ఫొటోలను రిలీజ్‌‌‌‌ చేశాక చాలా మంది ‘‘నేనే బబుష్కా లేడీ”అంటూ పోలీసుల దగ్గరకు వచ్చారు. కానీ.. వాళ్లలో ఒక్కరు కూడా తనే ‘బబుష్కా’ అని నిరూపించుకోలేకపోయారు. దాంతో వాళ్లంతా నకిలీలు అని తేల్చేశారు పోలీసులు. వాళ్లలో బెవర్లీ ఒలివర్ చెప్పిన విషయాలు మాత్రం చాలామంది నమ్మారు.

బెవర్లీ ఒలివర్ 
బెవర్లీ ఒలివర్ తనే బబుష్కా లేడీ అని 1970లో.. గ్యారీ షా అనే రీసెర్చర్‌‌‌‌‌‌‌‌కి చెప్పింది. ఆ ఫొటోల్లో ఉన్నది తనేనని, కెనెడీ హత్య జరిగినప్పుడు ‘‘సూపర్ 8 ఫిల్మ్ యాషికా” కెమెరాలో ఫొటోలు తీశానని చెప్పింది. ఆమె తీసిన ఫొటోల గురించి అడిగితే... ‘‘ఇద్దరు ఎఫ్‌‌‌‌బీఐ ఏజెంట్లు నా దగ్గరికి వచ్చి కెమెరాలోని ఫిల్మ్‌‌‌‌ని డెవలప్ చేయకముందే తీసుకెళ్లారు. పది రోజుల్లోపు ఫిల్మ్‌‌‌‌ని తిరిగి ఇచ్చేస్తామన్నారు. మళ్లీ తిరిగి రాలేదు. వాళ్లు ఏజెంట్లమని చెప్పుకున్నారు. కానీ.. ఎలాంటి ఆధారాలు చూపించలేదు” అని చెప్పింది. కొందరు ఆమె బబుష్కా లేడీ అని నమ్మినప్పటికీ.. మరికొందరు ఆమె మాటలను కొట్టి పారేశారు.

రష్యన్ స్పై లేడీ
బబుష్కా గెటప్‌‌‌‌ చూస్తుంటే అచ్చం రష్యన్‌‌‌‌లా ఉంది. కాబట్టి ఆమె రష్యన్‌‌‌‌ గూఢచారి అని చాలామంది అనుమానించారు. అందుకే కాల్పులు జరిగినా ధైర్యంగా నిలబడి ఉందని వాదించారు. కొందరేమో అమెరికన్‌‌‌‌ సీక్రెట్ సర్వీస్‌‌‌‌లో మెంబర్‌‌‌‌‌‌‌‌ అని, హత్య ఎవరు చేశారో తెలుసుకునేందుకు అలా నిలబడి చూస్తోందన్నారు. ఇంకొందరేమో కెనెడీని చంపింది ఆమెనే... ఆమె చేతిలోఉన్నది కెమెరా కాదు. తుపాకీ అని వాదించారు. ఏదేమైనా.. ఆమె పూర్తి వివరాలు మాత్రం ఇప్పటికీ తెలియలేదు.

అందుకే అలా పిలిచారు! 
ఆమె గురించి తెలుసుకునేందుకు పోలీసులు ఆమె ఫొటోని పబ్లిక్‌‌‌‌కి రిలీజ్‌‌‌‌ చేశారు. ఆమెను ఎక్కడైనా చూస్తే ఇన్ఫర్మేషన్‌‌‌‌ ఇవ్వాలని అనౌన్స్‌‌‌‌ చేశారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఒకట్రెండు కాదు, చాలా ఫొటోల్లో కనిపించిందామె. అన్నింటిలో ఒకే విధంగా ఉంది. ముఖం క్లారిటీగా కనిపించకుండా తలకు స్కార్ఫ్ కట్టుకుంది. చేతిలో కెమెరా పట్టుకుంది. కొందరు అది కెమెరా కాదు.. మరేదో వస్తువు అని అంచనా వేశారు. ఇంకొందరైతే అది తుపాకీ అన్నారు. అయితే.. అలా తలకు స్కార్ఫ్‌‌‌‌ కట్టుకునే అలవాటు ఎక్కువగా రష్యాలో ఉండే ఓల్డేజ్‌‌‌‌ విమెన్‌‌‌‌కి ఉంటుంది. అలాంటివాళ్లను రష్యాలో ‘‘బబుష్కా”అని పిలుస్తుంటారు. అందుకే ఆమెను ‘‘బబుష్కా లేడీ”అని పిలిచారు.