హైదరాబాద్, వెలుగు: డిస్కమ్‌లకు అప్పిలేట్ అథారిటీ ఉండగా.. నేరుగా కోర్టుల్లో కేసు వేయడం చెల్లదని డిస్కమ్‌లు వాదించాయి. ఒప్పందానికి వ్యతిరేకంగా మైట్రో రైల్ ప్రాజెక్టుకు కరెంట్ చార్జీలు పెంచుతూ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (టీఎస్‌ఈఆర్‌సీ) తీసుకున్న నిర్ణయంపై ఎల్ అండ్ టీ (మెట్రో రైల్) లిమిటెడ్ వేసిన రిట్‌పై విచారణను హైకోర్టు మంగళవారం కొనసాగించింది. అగ్రిమెంట్‌ను కాదని కరెంట్ చార్జీలు ఎందుకు పెంచారో చెప్పాలంటూ టీఎస్పీడీసీఎల్ను హైకోర్టు సోమవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. కౌంటర్ దాఖలు చేయాలంటూ నోటీసులూ ఇచ్చింది. ఈ క్రమంలోనే డిస్కమ్‌ల తరఫు లాయర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. అయితే, గతంలోని అగ్రిమెంట్‌ను ఉల్లంఘించడంపైనే కోర్టుకు వచ్చామని, విద్యుత్ చార్జీల పెంపుపై అప్పిలేట్ అథారిటీలో సవాల్ చేస్తామని ఎల్ అండ్ టీ లాయర్ చెప్పారు.
