కల్వకుంట్ల కుటుంబానిదే లక్ష కోట్ల భూ దోపిడీ..కవిత బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఆపాలి: ఆది శ్రీనివాస్ 

కల్వకుంట్ల కుటుంబానిదే లక్ష కోట్ల భూ దోపిడీ..కవిత బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఆపాలి: ఆది శ్రీనివాస్ 
  • కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ల గురించి ఆమెకు తెలియదా అని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లక్ష కోట్ల భూ దోపిడీ జరిగిందంటూ టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అధినేత కవిత చేస్తున్న వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని, అసలు భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ కల్వకుంట్ల కుటుంబానిదేనని విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం సీఎల్పీ మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనలో జరిగిన భూ కబ్జాల గురించి కవిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ హయాంలో అవినీతికి కిటికీలు తెరిచారని కవిత అంటున్నారని, అందులో ఆమె వాటా ఎంతో ప్రజలకు చెప్పాలన్నారు. జన్వాడలో కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావుల ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ల చుట్టుకొలతలు ఆమెకు బాగా తెలుసునని ఎద్దేవా చేశారు. కబ్జాల కోరల్లో చిక్కుకున్న చెరువులను, ప్రభుత్వ భూములను కాపాడుతున్న సీఎం రేవంత్ రెడ్డిని అభినందించాల్సింది పోయి, సానుభూతి కోసం ఆమె డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.

హైడ్రా ద్వారా ఇప్పటికే రూ.50 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరులపై కవిత చేస్తున్న ఆరోపణలను ఖండించారు. కృష్ణా జలాల విషయంలో ఉమాభారతి సమక్షంలో 299 టీఎంసీలకు సంతకం పెట్టి తెలంగాణ రైతులకు మరణశాసనం రాసింది హరీశ్ రావు కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ వాటాను తాకట్టు పెట్టిన కేసీఆర్, హరీశ్.. ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.