
రాజన్నసిరిసిల్ల/గంభీరావుపేట, వెలుగు: మహిళలు ఆర్థికంగా ఎదిగాలనే లక్ష్యంతో ప్రభుత్వం వారి కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తోందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కేకే మహేందర్ రెడ్డితో కలిసి గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో శ్రీ షిర్డీ సాయిబాబా మహిళా సమాఖ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంఘాల ద్వారా నిర్వహించే 3వ పెట్రోల్ బంక్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
సుప్రీం ఆదేశాల మేరకు స్పీకర్ నిర్ణయం
ముస్తాబాద్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గురువారం ఓ ప్రైవేట్హాస్పిటల్ను విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకుల ఆశలు గల్లంతయ్యాయన్నారు. 10 ఏండ్లు అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 60 మంది ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని, అప్పుడు లేని నైతిక విలువల గురించి ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారన్నారు.
వేములవాడ, వెలుగు: గురువారం వేములవాడ అర్బన్ మండల బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు నాగారం కొమురవ్వతో పాటు మరో 50 మంది కాంగ్రెస్‌లో చేరగా.. వారికి కండువా కప్పి ఆది శ్రీనివాస్ ఆహ్వానించారు.