వేములవాడ రాజన్న హుండీ దొంగలెవరు

వేములవాడ రాజన్న హుండీ దొంగలెవరు
  • ఫిరోజ్ కి దొరికిన బంగారం,అభరణాలు ఎక్కడివి
  • ఫిర్యాదు చేయని ఆలయ అధికారులు
  • సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు

వేములవాడ రాజన్న హుండీ దొంగలెవరన్నది ప్రశ్నార్థకంగా మారింది. పట్టణంలోని శాస్ర్తీనగర్ లో ఉండే ఫిరోజ్ ఆలయంలో దొరికినవాటిని విక్రయించే క్రమంలో పోలీసులకు పట్టు బడ్డాడు. పోలీసులు అతని ఇంటిని తనిఖీ చేయగా ఆభరణాల సంచి దొరికింది. అయితే హుండీ కౌంటింగ్ తర్వాత తాను ఆలయంలో భక్తులు వేసే పసుపు బియ్యం సేకరణకు వెళుతుంటానని, అందులో భాగంగా వెళ్తే ఆభరణాల బ్యాగ్ కనిపించడంతో తీసుకువచ్చినట్లు తమ విచారణలో ఫిరోజ్ తెలిపాడని పోలీసులు అంటు న్నారు. బ్యాగులో లింగాకారం, నాగపడగలు, శూలాలు, పాదాలు, నంది వాహనం తదితర వెండి, బంగారు వస్తువులు ఉన్నాయి. దీనిపై ఆలయ అధికారులు ఫిర్యాదు చేయకపోవడంతో సుమోటోగా కేసు నమోదు చేసి పోలీసులు ఫిరోజ్ ను రిమాండ్ కి తరలించారు. ఈ విషయమై ఆలయ కార్యనిర్వహణ అధికారి కృష్ణవేణి మాట్లాడుతూ హుండీ కౌంటింగ్ సజావుగా సాగిందని, ఫిరోజ్ దగ్గర దొరికి ఆభరణాలతో తమకు సంబంధం లేదన్నారు. ఆలయ కెమెరా ల స్టోరేజి పెంచుతామన్నారు. 16 రోజులు మాత్రమే సీసీ ఫుటేజీ అక్టోబర్ 23న రాజన్న హుండీ కానుకలను ఆలయ ఓపెన్ స్లాబ్ లో లెక్కించారు. ముందుగానే కొందరు దొంగలు భక్తులు వేసిన కానుకలను అక్కడ దాచిపెట్టి ఉంటారని, అవే ఫిరోజ్ కు దొరికి ఉంటాయని భావిస్తున్నారు. రాజన్న ఆలయ ఆవరణతోపాటు ధర్మశాలలో 128 కెమెరాలున్నాయి . హుండీ కౌంటింగ్ సందర్భంగా 10 కెమెరాలను ఏర్పాటు చేస్తారు. స్టోరేజీ కెపాసీటి తక్కువ ఉండడం వల్ల సీసీ ఫుటేజీ 16 రోజులే ఉంచుతున్నారు. లెక్కింపు పూర్తయి నెల కావస్తుండడంతో సీసీ ఫుటేజీ దొరకడం కష్టంగా మారింది.