
జెనెవా: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు భారీగా పెరుగుతున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. 92 దేశాల్లో 35 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ బుధవారం పేర్కొన్నారు. 12 మంది మంకీపాక్స్ బారిన పడి చనిపోయినట్లు వెల్లడించారు. ఒక్క వారంలో కేసుల సంఖ్య 20 శాతానికి పెరిగిందని చెప్పారు. ‘‘గతవారం 7,500 కేసులు నమోదు కాగా, అంతకుముందు వారం కేసులతో పొలిస్తే ఇది 20 శాతం పెరిగాయి.
ఇది కూడా ముందు వారంతో పొలిస్తే మరో 20 శాతం కేసులు ఎక్కువగా పెరిగాయి”అని తెలిపారు. గే లలోనే ఎక్కువగా మంకీపాక్స్ కేసులు వస్తున్నాయని, ఇవి కూడా యూరప్, అమెరికా నుంచే ఎక్కువగా ఉన్నాయన్నారు. అన్ని దేశాల ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించాలని, వ్యాధి వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.