కరోనా రూల్స్‌‌ పాటిస్తే లాక్‌‌డౌన్‌‌ అక్కర్లే

కరోనా రూల్స్‌‌ పాటిస్తే లాక్‌‌డౌన్‌‌ అక్కర్లే

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌‌ వేసుకోవడం, సోషల్‌‌ డిస్టెన్స్‌‌ పాటించడం, ఇండోర్‌‌‌‌ ప్లేసుల్లో బాగా వెంటిలేషన్‌‌ వచ్చేటట్లు చూడటం తదితర కరోనా రూల్స్‌‌ పాటిస్తే లాక్‌‌డౌన్‌‌ పెట్టాల్సిన అవసరమే ఉండదని వరల్డ్‌‌ హెల్త్‌‌ ఆర్గనైజేషన్‌‌(డబ్ల్యూహెచ్‌‌వో) ఇండియా ప్రతినిధి రోడెరికో హెచ్‌‌ ఆఫ్రిన్‌‌ పేర్కొన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు ఈ రూల్స్‌‌ పాటించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న కరోనా రూల్స్‌‌ను ప్రభావవంతంగా పాటించడంతో పాటు వ్యాక్సినేషన్‌‌ స్పీడప్‌‌ చేయాలని, కచ్చితంగా మాస్క్‌‌లు పెట్టుకోవాలని, ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్‌‌ చేసుకోవాలని, ఫిజికల్‌‌ డిస్టెన్స్‌‌ పాటించాలని, క్రౌడ్‌‌కు దూరంగా ఉండాలని చెప్పారు. ఇవన్నీ చేస్తే కరోనా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించకుండా వైరస్‌‌ చైన్‌‌ను బ్రేక్‌‌ చేయొచ్చన్నారు. ప్రయాణాలపై పూర్తిగా బ్యాన్‌‌ విధించడాన్ని డబ్ల్యూహెచ్‌‌వో సమర్థించదని ఆఫ్రిన్‌‌ అన్నారు. దీని వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయని చెప్పారు. అలాగని మొత్తానికే వదిలేయకూడదని, కరోనా రూల్స్‌‌ పాటించేలా చూడాలని పేర్కొన్నారు.