ఎవరీ ప్రిగోజిన్‌.. ఓ దొంగ.. ఓ వంట వాడు.. ఇప్పుడు దేశంపై తిరుగుబాటు..

ఎవరీ ప్రిగోజిన్‌.. ఓ దొంగ.. ఓ వంట వాడు.. ఇప్పుడు దేశంపై తిరుగుబాటు..

రష్యాపై తిరుగుబాటు చేసి.. అధ్యక్షుడు పుతిన్ కే వార్నింగ్ ఇచ్చారు వాగ్నర్ గ్రూప్ ప్రైవేట్ సైన్యం అధినేత యెవ్ జెనీ ప్రిగోజిన్. దేశంపై, దేశ సైన్యంపై తిరుగుబాటు చేస్తున్న ఈ వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజివ్ ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. దేశంపై తిరుగుబాటు చేసేంత దమ్మూ, దైర్యం ఉన్న ప్రిగోజివ్ ఏం చేస్తుంటాడు.. అతని వివరాలు ఏంటీ అని ప్రతి ఒక్కరిలో ఆసక్తి రేపుతున్నాయి. ఆ వివరాల్లో మీ కోసం...

ప్రిగోజివ్.. వాగ్నర్ గ్రూప్ ప్రైవేట్ సైన్యం అధినేత. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం. ఒకప్పుడు వంట వాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏం తినాలి.. ఎలా తినాలి అనేది డిసైడ్ చేసే వంట వాడు. అతను చెయ్యి తిరిగిన వంట మనిషి. రష్యాలోని అతి పెద్ద సిటీ అయిన పీటర్స్ బర్గ్ లోని చెఫ్ గా ఉంటూ రెస్టారెంట్లు ఓపెన్ చేశాడు ప్రిగోజివ్. అతని వంటలు బాగుండటంతో.. పుతిన్ తరచూ ఆ రెస్టారెంట్ కు వెళ్లి ప్రిగోజివ్ వండిన వంటలు తింటూ ఉండే వాడు. పుతిన్ తన అతిధులను కూడా ఈ రెస్టారెంట్ గా తీసుకొస్తూ ఉండేవారు. పుతిన్ పరిచయంతో.. బాగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. రెస్టారెంట్ల వ్యాపారం బాగా సాగేది. 

అలా పుతిన్ తో ఏర్పడిన పరిచయంతో.. ఆ తర్వాత ఏకంగా పుతిన్ వ్యక్తిగత వంట మనిషిగా మారిపోయాడు. అధ్యక్ష భవనంలో పుతిన్ తినే తిండిని వండేది.. డిసైడ్ చేసేది ప్రిగోజివ్ అంటారు. అంతే కాకుండా పుతిన్ యుద్ధ, రాజకీయ వ్యూహాల్లోనూ ప్రిగోజివ్ ఆలోచనలు ఉంటాయనే ప్రచారం కూడా ఉంది. విదేశాల్లో లేదా కీలకమైన రహస్య ఆపరేషన్లను ప్రిగోజివ్ ద్వారా చేయిస్తూ ఉండేవారని రష్యాలో ప్రచారం ఉంది. దీని కోసం ప్రిగోజివ్ ఆధ్వర్యంలో ఏర్పడిందే వాగ్నర్ గ్రూప్ అంటారు. ఈ గ్రూప్ ను ప్రైవేట్ సైన్యంగా తయారు చేయటంలో వందకు వంద శాతం ప్రిగోజివ్ పాత్ర ఉంది. రష్యా సైన్యానికి జీతాలు చెల్లించినట్లే.. ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ కు కూడా జీతాలు, ఇతర అలవెన్సులు ఇస్తుంటారు. దీంతో పెద్ద సంఖ్యలో యువతను ఈ ప్రైవేట్ సైన్యంలో చేరింది. మొదట్లో 5 వేల మందిని రిక్రూట్ చేసుకోగా.. ఆ తర్వాత ఇది 15 వేల చేరింది. ప్రస్తుతం ప్రిగోజివ్ ఆధ్వర్యంలోనే వాగ్నర్ సైన్యంలో 50 వేల మంది ఉంటారనే సమాచారం ఉంది. 

పుతిన్ కు ఎంతో నమ్మకస్తుడు కావటంతో.. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో తూర్పు ఉక్రెయిన్ లో.. రష్యా సైన్యానికి సాయం చేయటం కోసం ప్రిగోజివ్ ఆధ్వర్యంలోని వాగ్నర్ ప్రైవేట్ సైన్యాన్ని తరలించారు. అక్కడి నుంచి పుతిన్ – ప్రిగోజివ్ మధ్య గ్యాప్ వచ్చింది. రష్యా సైన్యం వ్యవహారాలను నచ్చని ప్రిగోజివ్.. తీవ్ర విమర్శలు చూస్తూ వస్తున్నారు. దీంతో ప్రిగోజివ్ శక్తిని తగ్గించాలని.. అతని సైన్యాన్ని కట్టడి చేయాలనే కుట్ర, కుతంత్రాలు రష్యా సైన్యం నుంచి మొదలయ్యాయి. 

రష్యా సైన్యం ద్వారా అధ్యక్షుడు పుతిన్ చేస్తున్న కుట్రను పసిగట్టిన ప్రిగోజివ్.. ఇప్పుడు రష్యా సైన్యంపైనే తిరుగుబాటు చేస్తున్నారు. రొస్తోర్ లోని సైనిక స్థావరాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు. ఓ వంటవాడిగా.. పుతిన్ వ్యక్తిగత విషయాలు అన్నీ తెలిసిన వాడిగా ప్రిగోజివ్ ఇప్పుడు చేస్తున్న తిరుగుబాటు యుద్ధంలో ఎంత వరకు గెలుస్తాడు అనేది ఆసక్తి రేపుతోంది. 

18 ఏళ్లకే ఏడాది జైలు శిక్షతోపాటు.. ఆ తర్వాత దోపిడీ కేసులో తొమ్మిదేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాతే వంట వాడుగా అవతారం ఎత్తాడు..  మంచి చెఫ్ గా గుర్తింపుతో.. ఇప్పటి అధ్యక్షుడు పుతిన్ కు దగ్గరయ్యాడు.. ఇప్పుడు దేశంపైనే తిరుగుబాటు చేశాడు.. ఎంత బ్రెయిన్ లేకపోతే.. ఓ వంట వాడు.. ఇప్పుడు ఓ దేశం సైన్యాన్ని సవాల్ చేస్తాడు.. 

ALSO READ:రష్యా రాజధాని మాస్కో వైపు దూసుకొస్తున్న వాగ్నర్ సైన్యం...