ఐపీఎల్‌ కొత్త స్పాన్సర్ ఎవరు?

ఐపీఎల్‌ కొత్త స్పాన్సర్ ఎవరు?

ముంబై: ఈ ఏడాది ఐపీఎల్‌‌ టైటిల్‌‌ స్పాన్సర్ షిప్‌‌ నుంచి చైనా మొబైల్‌‌ కంపెనీ వివో వైదొలిగింది. వివోతో ఈ ఏడాది ఒప్పం దం లేదని బీసీసీఐ గురువారం అఫీషియల్‌‌ అనౌన్స్‌‌ మెంట్‌ చేసింది. ఒకటి రెండు రోజుల్లో కొత్త స్పాన్సర్ కోసం టెండర్లను పిలువనుంది. ఏడాదికి రూ. 440 కోట్లు చెల్లించే వివో.. ఐపీఎల్‌‌ స్టార్టయ్యే నెలన్నర ముందు తప్పుకోవడం ఆందోళన కలిగించినా.. ఈ క్రైసిస్‌ నుంచి బయటపడతామని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత పెద్ద మొత్తం రాబట్టడం సాధ్యమేనా ? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నా.. చాలా బ్రాండ్స్‌‌ తమతో చేతులు కలిపేందుకు ఉత్సాహంగా ఉన్నాయి అన్నారు. ఈ రేస్‌ లో రిలయన్స్‌‌ జియో, బైజూస్‌ , అమెజాన్‌ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. బైజూస్‌ ఇప్పటికే టీమిండి యా జెర్సీ స్పాన్సర్ గా ఉంది. ఈ మూడు బ్రాండ్స్‌‌లోనూ జియోకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కరోనా కష్ట కాలంలో కూడా ఆ కంపెనీ దూసుకెళ్తోంది. ఇండి యాలో అతి పెద్ద టెలికాం కంపెనీగా రూ. 1.5 లక్షల కోట్ల పైచిలుకు విలువ కలిగిన జియో ఈ మధ్యే అనేక ప్రాజెక్ట్స్‌ ను అనౌన్స్‌‌ చేసింది. ఐపీఎల్‌‌తో జట్టు కడితే వాటి కి మంచి పబ్లిసిటీ వస్తుందని చూస్తోంది. అంతేకాక ‘ఆత్మనిర్భర్’ విజన్‌ కు అది పర్ఫెక్ట్‌‌ సూట్‌ అవుతుంది. ఇండి య లీగ్‌ కు ఇండియన్‌ కంపెనీ ప్రధాన స్పాన్సర్ గా ఉంటే ఐపీఎల్‌‌ 2020 ద్వారా మంచి సందేశం కూడా ఇవ్వొచ్చు. స్పాన్సర్ షిప్‌‌ విషయమై జియో, బీసీసీఐ మధ్య ఇప్పటికే ప్రాథమిక చర్చలు కూడా మొదలయ్యాయని సమాచారం. జియో మాతృ సంస్థ రిలయన్స్‌‌ ఇప్పటికే ముంబై ఇండియన్స్‌‌ టీమ్‌ కు ఓనర్ గా ఉంది. లీగ్‌ లాభ నష్టాల గురించి ఆ కంపెనీకి బాగా తెలుసు. ఒకటి రెండు వారాల్లో ‘రిలయన్స్‌‌ జియో ఐపీఎల్‌‌ 2020’ అని అనౌన్స్‌‌మెంట్‌ వచ్చినా ఆశ్చర్యం లేదు.

మరోవైపు నేషనల్‌‌ టీమ్‌ జెర్సీ స్పాన్సర్ బైజూస్‌ కూడా ఇంట్రస్ట్‌‌ చూపిస్తోంది. ఆన్‌ లై న్‌ ఎడ్యు కేషన్‌ స్టార్టప్‌‌ బైజూస్‌ ఈ విషయంపై ఎంక్వైరీ మొదలు పెట్టిందని తెలుస్తోంది. లాక్‌ డౌన్‌ టైమ్‌ లో బైజూస్‌ మార్కె ట్‌ పరిధి అనూహ్యంగా పెరిగింది. ఇంతకుముందు ఇండియా జెర్సీ పార్ట్‌‌నర్ గా ఉన్న ఒప్పో నుంచి 35 శాతం డిస్కౌంట్‌ తో బైజూస్‌ రైట్స్‌‌ సొంతం చేసుకుంది. ఇప్పుడు కూడా అలాంటి డిస్కౌంట్‌ వస్తే ఐపీఎల్‌‌ 2020తో కలిసి నడిచేందుకు ఆ సంస్థ రెడీగా ఉందట. ఇక ఈ-కామర్స్‌‌ దిగ్గజం అమెజాన్‌ కూడా ఐపీఎల్‌‌ టైటిల్‌‌ స్పాన్సర్ బరిలో నిలిచే చాన్సుంది. టీవీ ప్రకటన రూపంలో ఐపీఎల్‌‌ టైమ్‌ లో ఆ సంస్థ భారీగానే ఖర్చు చేస్తోంది. టైటిల్‌‌ రైట్స్‌‌ కొనుగోలు చూస్తే ఈ సీజన్‌ మొత్తం ఫ్రంట్‌ లైన్‌ లో కనిపించొచ్చు. పైగా, ఇది ఫెస్టివల్‌‌ సీజన్‌ కావడంతో అమెజాన్‌ కు గోల్డెన్‌ చాన్స్‌‌ కానుంది. వీటితో పాటు కొకకోలా, టాటా గ్రూప్‌‌ కూడా ఐపీఎల్‌‌తో జట్టు కట్టే అవకాశాలు లేకపోలేదు.

2021లో మళ్లీ వివోనేనా?

ఈ సీజన్‌ ఐపీఎల్‌ కు దూరమైన వివో వచ్చే ఏడాది మళ్లీ జట్టు కట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఆ సంస్థతో ఈ ఏడాదికి మాత్రమే ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు  వన్‌ లైన్‌ స్టేట్‌ మెంట్‌ ఇచ్చిన బోర్డు ఇతర వివరాలు వెల్లడించలేదు. మరోవైపు సదరు కంపెనీ సైతం ఇదే విషయాన్ని ప్రకటించింది. ‘ఐపీఎల్‌ 2020లో తమ పార్ట్‌‌నర్ షిప్‌ కు విరామం ఇవ్వాలని బీసీసీఐ, వివో పరస్పరం నిర్ణయించాయి’ అని స్పష్టం చేసింది. రెండు ప్రకటనల్లోనూ డీల్‌ ను రద్దు చేస్తు న్నట్టు చెప్పలేదు. దీంతో రెండు పార్టీలు.. 2021 నుంచి కొత్తగా మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకోవాలని ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇండియా చైనా మధ్య దౌత్య సంబంధాలు మెరుగైతేనే ఈ డీల్‌ కుదిరే ఛాన్సుంది.