టెస్లా CFO గా భారత సంతతి వ్యక్తి..ఎవరంటే?

టెస్లా CFO గా భారత సంతతి వ్యక్తి..ఎవరంటే?

ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాకు చీప్ ఫైనాన్షియల్  ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా భారత సంతతి వ్యక్తి వైభవ్  తనేజా నియమితులయ్యారు.  2016 నుంచి చీఫ్ అకౌంటింగ్  ఆఫీసర్ గా ఉన్న ఆయనకు ఎలాన్ మస్క్ ప్రమోషన్ ఇచ్చారు. గత 13 ఏళ్లుగా సీఎఫ్ ఓగా పనిచేసిన జకీర్ కిర్కోర్న్  ఆగస్టు 4న పదవి విరమణ చేశారు.

వైభవ్ తనేజా ఢిల్లీ యూనివర్శిటీలో బీకాం చదివారు. ఐసీఏఐలో చార్టర్డ్ అకౌంటెన్సీ పూర్తి చేశాడు. 1999 జూలై నుంచి 2016 మార్చి వరకు అకౌంటింగ్ ,ఆడిటింగ్, హ్యూమన్ రిసోర్స్ కన్సల్టింగ్ కంపెనీ పీడబ్ల్యూసీ (ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ) లో పనిచేశారు. ఆ తర్వాత టెస్లాలో చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యారు. ఇపుడు సీఎఫ్ఓగా పదోన్నతి సాధించారు.